ప్రముఖ నటుడు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ ‘‘వికో జాన్సన్’’ కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. దాదాపు 10 ఏళ్లకు పైగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 2013లో ఆ క్యాన్సర్ నయం చేయలేనిదిగా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు ఆయనకు ఓ హెచ్చరిక జారీ చేశారు. కీమో థెరపీ మానేస్తే.. ఆ తర్వాత కేవలం 10 నెలలు మాత్రమే బతుకుతావని స్పష్టం చేశారు. దీంతో ఆయన 2013నుంచి కీమో థెరీప చేయించుకుంటూ వస్తున్నారు. తొమ్మిదేళ్లు గడిచాయి.
మంగళవారం 75 ఏళ్ల వయసులో ఆయన ఆరోగ్యం క్షీణించింది. క్యాన్సర్ పూర్తిగా ఆయన్ని కోలుకోకుండా చేసింది. ఇంట్లోనే వీకో జాన్సన్ మరణించారు. ఈ విషయాన్ని వికో జాన్సన్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇచ్చే బ్యాండ్ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ మేరకు వికో జాన్సన్ సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘‘ ఇలాంటి పోస్టు పెట్టాల్సి వస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. బరువెక్కిన హృదయంతో ఈ పోస్టు పెడుతున్నాం. వికో జాన్సన్ చనిపోయారు. నవంబర్ 21వ తేదీ, సోమవారం రోజున ఇంట్లో ఆయన తుది శ్వాస విడిచారు.
కుటుంబ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించినందుకు మీ అందరికీ థాంక్స్. ఇది చాలా విషాదకర సమయం. రెస్ట్ ఇన్ పీస్ వికో జాన్స్‌న్’’ అని పేర్కొంది. కాగా, వికో జాన్సన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. గిటారిస్ట్‌గా, సింగర్‌గా, నటుడిగా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. గిటార్‌ను ప్లే చేయటంలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ‘‘గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్’’ సిరీస్‌లో ‘‘సెర్ ఇలిన్ పేన్’’ పాత్రతో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ పలు ఎపిసోడ్‌లలో నటించారు. ఇదే ఆయన నటించిన మొదటి, చివరి వెబ్ సిరీస్, సినిమా కావటం గమనార్హం.
This is the announcement we never wanted to make, & we do so with a very heavy heart: Wilko Johnson has died. He passed away at home on Monday 21st November. Thank you for respecting the family’s privacy at this very sad time. RIP Wilko Johnson.
(Image: Leif Laaksonen) pic.twitter.com/1cRqyi9b9X— Wilko Johnson (@wilkojohnson) November 23, 2022