ఈసారి సంక్రాంతి మాములుగా లేదు. బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ అనే రేంజులోనే ఉంది. స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య ఇద్దరూ కూడా హిట్స్ కొట్టేశారు. తమ తమ సినిమాలతో అభిమానులని మాత్రమే కాదు ప్రేక్షకుల్ని కూడా ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్షన్స్ సునామీ కూడా సృష్టిస్తున్నారు. ఇక తొలిరోజు వసూళ్లనే తీసుకుంటే.. ఇద్దరు హీరోలు కూడా హాఫ్ సెంచరీలు కొట్టేశారు. అందులో భాగంగా బాలయ్య సినిమా కొన్నిచోట్ల.. చిరు సినిమా కొన్నిచోట్లు పైచేయి సాధించింది.
ఇక విషయానికొస్తే.. సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పోటీపడ్డారు. బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా ఎప్పటిలానే తనకు అచ్చొచ్చిన ఫ్యాక్షన్ జానర్ తో వచ్చారు. ఓన్లీ యాక్షన్ అనే రేంజులో అదరగొట్టారు. ఇక వింటేజ్ చిరంజీవిని ‘వాల్తేరు వీరయ్య’లో ఫ్యాన్స్ చూస్తున్నారు. బాస్ కామెడీ టైమింగ్, డ్యాన్సుల్లో గ్రేస్, యాక్షన్ సీన్స్ లో చరిష్మా.. ఇలా ఏది చూసుకున్నా సరే మెగాస్టార్ కేక పుట్టించారు. ఈ క్రమంలోనే బాలయ్య, చిరు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతెంత వసూలు చేశారనేది ఇప్పుడు చూద్దాం.
‘వీరసింహారెడ్డి’ మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్ రూ.54 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.25.35 కోట్ల షేర్ సొంతం చేసుకుంది.
‘వాల్తేరు వీరయ్య’ మూవీ తొలిరోజు వరల్డ్ వైడ్ రూ.55 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.23 కోట్లకుపైగా షేర్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ చిరు సినిమాతో పోలిస్తే బాలయ్య సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా తక్కువ మార్జిన్ లో మాత్రమే ఎక్కువగా వచ్చాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం తొలిరోజు బాలయ్య సినిమాకు వరల్డ్ వైడ్ రూ.54 కోట్ల గ్రాస్, చిరంజీవి సినిమాకు రూ.55 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే బాలయ్య కంటే చిరు ఓ మెట్టు పైనే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఈ రెండు సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ చూసిన తర్వాత మీకేమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.