మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ కొట్టేశారు! ‘వాల్తేరు వీరయ్య’గా థియేటర్లలోకి వచ్చిన చిరు.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నారు. తొలిరోజే అద్భుతమైన వసూళ్లు సాధించారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది కదా అసలైన సంక్రాంతి అని సెలబ్రేషన్స్ తో కేక పుట్టిస్తున్నారు. ఇక తాజాగా వరల్డ్ వైడ్ రిలీజైన ఈ మూవీ.. కమర్షియల్ గా సక్సెస్ అయింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీని చూసేందుకు అభిమానులు మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా క్యూ కడుతున్నారు.
ఇక విషయానికొస్తే.. ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోలైన చిరంజీవి, బాలయ్య సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అందులో బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ తొలుత రిలీజ్ కాగా హిట్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతుంది. ఆ తర్వాత రోజు అంటే జనవరి 13న విడుదలైన చిరు ‘వాల్తేరు వీరయ్య’.. ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియెన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది. కామెడీ, డ్యాన్స్, యాక్షన్ సీన్స్ లో వింటేజ్ చిరు కనిపించేసరికి ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. అరిచి గోల గోల చేస్తున్నారు.
ఇక అందరినీ ఆకట్టుకుంటున్న ‘వాల్తేరు వీరయ్య’.. తొలిరోజు వరల్డ్ వైడ్ రూ.55 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.23 కోట్లకుపైగా షేర్ ఉన్నట్లు తెలుస్తోంది. అలానే
కలెక్షన్స్ వచ్చాయి. ఇలా తొలిరోజే హాఫ్ సెంచరీ మార్క్ క్రాస్ చేసిన చిరు సినిమా.. ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తోంది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వసూలు చేస్తున్నాయి. మరి ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ డే కలెక్షన్స్ పై మీ ఓపినియన్ ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.