టాలీవుడ్‌లో మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న హీరో ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చేది నందమూరి హీరో బాలకృష్ణ. ఇక సినిమాల్లో ఆయన నోటి నుంచి వెలువడే మాస్ డైలాగ్స్‌కి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రస్తుతం బాలయ్య.. పవర్‌ఫుల్ అండ్ ఫుల్‌లెంత్ మాస్ రోల్‌లో నటిస్తోన్న చిత్రం.. వీరసింహారెడ్డి. ఆయన నటిస్తోన్న 107వ చిత్రం ఇది. దీనికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం బాలయ్య 107 సినిమా టైటిల్ ఖరారు చేస్తూ.. విడుదలచేసిన పోస్టర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. పులిచర్ల 4 కిలోమీటర్లు అన్న మైలు రాయి మీద.. బాలయ్య కాలుమోపి.. ఠీవీగా నిలబడి ఉండగా.. పక్కనే దానికి అనుకుని ఉన్న గొడ్డలిని చూస్తే.. రండిరా చూసుకుందాం అని బాలయ్య ప్రత్యర్థులకు సవాలు విసురుతున్నట్లుగా ఉంది.
ఇప్పుడు ఈ పోస్టర్ ప్రస్తావన ఎందుకంటే.. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. మీమర్లు తెగ పుట్టుకొచ్చారు. మంచైనా.. చెడైనా.. ఏదైనా.. సరే.. దానికి తగ్గ సినిమా ఫోటోలను, వీడియోలను జత చేసే.. సూటిగా సుత్తి లేకుండా విషయాలను చెబుతున్న తీరు ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. ఈ క్రమంలో తాజాగా బాలయ్య వీరసింహారెడ్డి పోస్టర్‌ని కూడా ఇలానే వాడేశారు మీమర్స్. బాలయ్య వీరసింహారెడ్డి లుక్‌లోకి విరాట్ కోహ్లీని మార్ఫ్ చేసి వదిలిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
ఈ ఫోటోని స్టార్ స్పోర్ట్స్ తెలుగు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఇది వైరలయ్యింది. ‘‘చేజింగ్‌లో ఓడిపోవడం నా బయోడేటాలోనే లేదు!’’ అని విరాట్ కోహ్లీ డైలాగ్ చెప్తున్నట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. అలానే కోహ్లీ పేరును కూడా .. విరాట్ సింహ కోహ్లీగా మార్చేశారు. ‘వీరసింహారెడ్డి’ పోస్టర్‌లో గొడ్డలి ఉన్నచోట బ్యాట్ పెట్టారు. మైలురాయిపై ‘పులిచర్ల 4 కి.మీ’ అని రాసి ఉంటే.. దాన్ని తీసి కోహ్లీ స్కోరు 82 నాటౌట్ (53) అని మార్చారు. పాకిస్తాన్ మీద కోహ్లీ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌ను ఈ విధంగా అభినందించారు. అయితే, ఈ పోస్టర్ క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు బాలయ్య అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.
“చేజింగ్ లో ఓడిపోవడం నా బయోడేటా లోనే లేదు!” – విరాట్ సింహ కోహ్లీ! 😎👊🏻#ViratKohli #KingKohli #NBK107 #VeeraSimhaReddy #JaiBalayya #TeamIndia #IndianCricketTeam#BelieveInBlue 💙 pic.twitter.com/3CxUTWk5tl
— StarSportsTelugu (@StarSportsTel) October 23, 2022