సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి చాలా మంది బాల నటులుగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే మళ్లీ హీరో గానో, హీరోయిన్ గానో తెరపై తళుక్కున మెరుస్తుంటారు. అయితే ఈ సంప్రదాయం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచే వస్తూ ఉంది. బాలకృష్ణ, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్ లు పలు సినిమాల్లో బాల నటులుగానే వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే అలనాటి తార శ్రీదేవి సైతం బాల నటిగా తెరపై మెరిసి ఆపై హీరోయిన్ గా తెరంగ్రేటరం చేసింది. ఇప్పుడు ఇదే కోవలోకి చేరబోతోంది ‘నాన్న’ సినిమాలో విక్రమ్ కు కూతురుగా చేసిన చిన్నారి సారా అర్జున్.
‘నాన్న’ చియాన్ విక్రమ్ మెంటల్లీ డిజేబుల్ పర్సన్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న చిత్రం. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ చిత్రంలో విక్రమ్ కూతురిగా నటించింది చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్. మెంటల్లీ డిజేబుల్ అయిన నాన్నని ఎంతో ప్రేమగా చూసుకునే క్యారెక్టర్ లో ఈ చిన్నారి నటించింది. ఈ పాత్రలో సారా అర్జున్ అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ చిత్రంలోని నటనకు గాను మన్ననలు పొందింది ఈ చిన్నారి. ఇక ఈ చిత్రం తర్వాత పలు తమిళ చిత్రాల్లో సైతం నటించింది సారా.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా చిత్రంగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ – 1’. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, త్రిష, ప్రకాశ్ రాజ్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ యుక్తవయసులో ఉన్నప్పుడు ఓ యువతిని ప్రేమిస్తాడు. అది ఐశ్వర్యరాయ్ యుక్త వయసు పాత్ర. ఈ పాత్రలో నటించింది సారా అర్జున్. నాన్న చిత్రంలో కూతురు పాత్రలో నటించి ఇప్పుడు ప్రియురాలి పాత్రలో నటించడంతో ఈ అమ్మడుపై నెట్టింట్లో ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సారా అర్జున్ పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.