తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. కమల్ హాసన్ అభిమాని అయిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించడంతో, ఈ సినిమా అభిమానులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో ఉండటంతో, ఈ చిత్రాన్ని చూసేందుకు కమల్ హాసన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక సినిమా విడుదలైన రోజు నుంచి సూపర్‌హిట్ టాక్ రావడమేకాక.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విక్రమ్ సినిమా విడుదలయ్యి.. ఇప్పటికి 10 రోజులు పూర్తయిన.. కలెక్షన్ల వసూళ్లలో మాత్రం వెనకబడటం లేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విక్రమ్ సినిమా 310 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక అతి త్వరలోనే ఈ చిత్రం రికార్డులన్నింటిని బ్రేక్ చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా కమల్ హాసన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే.. గత కొంత కాలంగా ఆయన వరుస ప్లాఫ్‌లతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో విక్రమ్ విజయం ఆయనకు కొత్త ఎనర్జీని ఇచ్చింది. ఈ సందర్భంగా కమల్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘డబ్బుల గురించి చింతించని నాయకుడు తోడు ఉంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతారు. నేను 300 కోట్ల రూపాయలు సంపాదించగలను అని చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాలేదు. పైగా నేను డబ్బా కొడుతున్నాను అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరే స్వయంగా మీ కళ్లతో చూస్తున్నారు.. నేను చెప్పిన మొత్తం వచ్చింది(విక్రమ్ బాక్సాఫిస్ కలెక్షన్లను ఉద్దేశిస్తూ)’’ అన్నారు.
ఇది కూడా చదవండి: Adire Abhi: జబర్దస్త్ స్టార్ అదిరే అభికి ప్రమాదం! తీవ్ర గాయాలు!
‘‘ఇప్పుడు నేను నా అప్పులన్ని తీరుస్తాను.. మనస్ఫూర్తిగా నాకు నచ్చింది తింటాను. నా కుటుంబానికి, స్నేహితులకు ఏం ఇవ్వగలనో అది ఇస్తాను. ఇక డబ్బులన్ని అయిపోయాక.. నా దగ్గర ఏం లేవు.. అందుకే ఇవ్వలేకపోతున్నాను అని చెబుతాను. అంతేతప్ప.. గొప్ప కోసం వేరే వారి డబ్బులు తెచ్చి నా పేరు మీద ఖర్చుపెట్టను. నాకు ఏలాంటి అలంకారాలు వద్దు.. నేను మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కమల్ కామెంట్స్‌పై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Adivi Sesh: అడవి శేష్‌కు తమ్మారెడ్డి సూటి ప్రశ్న… ‘మహేష్ బాబును పొగడలేదు.. నీకు అంత పొగరా?’