ఏ రంగంలో అయినా నంబర్ వన్ పొజిషన్ కోసం గొడవలు అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోల మధ్య నంబర్ వన్ ఎవరు అనే అంశం మీద కోల్డ్ వార్ నడుస్తుంటుంది. హీరోలకి లేకపోయినా ఆ వ్యత్యాసం అనేది ఆయా హీరోల అభిమానుల మధ్య ఉంటుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తమ హీరోనే నంబర్ వన్ అనే స్థాయికి అభిమానులు వెళ్ళిపోతారు. తాజాగా హీరో విజయ్ విషయంలో అదే జరుగుతుంది. కోలీవుడ్ నంబర్ వన్ హీరో, టాప్ హీరో విజయ్ అని అంటున్నారు. రీసెంట్ గా దిల్ రాజు దీనికి ఆద్యం పోస్తూ.. విజయ్ ని మించిన హీరో లేడని, అజిత్ కంటే పెద్ద స్టార్ అని, తమిళనాడులో విజయ్ నంబర్ వన్ హీరో అని ఆకాశానికి ఎత్తేశారు. దీంతో దిల్ రాజు.. అజిత్ అభిమానుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.
దిల్ రాజుని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. దిల్ రాజుకి మద్దతుగా విజయ్ ఫ్యాన్స్ బరిలోకి దిగి అజిత్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుండగా.. ఇప్పుడు ఈ వార్ లోకి రజినీకాంత్ ఫ్యాన్స్ దూరారు. దీనికి కారణం వారసుడు మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో విజయ్ అండ్ ఫ్యాన్స్ చేసిన పనే. విజయ్ సైలెన్స్, ఫ్యాన్స్ అత్యుత్సాహం రజినీకాంత్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. ఆడియో లాంచ్ ఈవెంట్ లో విజయ్ ని నంబర్ వన్ హీరో అంటూ ఫ్యాన్స్ గోల గోల చేశారు. అభిమానుల మాటలకు తగ్గట్టే.. విజయ్ కూడా సైలెంట్ గా ఉన్నారు. తాను నంబర్ వన్ హీరో అన్నట్టే ఫీలవుతూ వచ్చారు. అంతేకాదు.. తనకెవ్వరూ పోటీ కాదని, తనకి తనతోనే పోటీ అని అన్నారు.
ఇన్నాళ్ల సినీ జీవితంలో ఒక్కడే తనతో పోటీ పడ్డాడని, ఆ ఒక్కడి పేరే జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అని అన్నారు. అయితే ఇదే ఇప్పుడు రజినీకాంత్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. రజినీకాంత్ తో పోటీ పడేంత సీన్ విజయ్ కి లేదని, అందుకే తనతో తాను పోటీ పడినట్లు చెప్పుకొచ్చాడని విజయ్ మీద రజినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజయ్ ఫ్యాన్స్.. నంబర్ వన్ హీరో విజయ్ అని అన్నప్పుడు.. సైలెంట్ గా ఉండడం ఏంటని.. నేను నంబర్ వన్ కాదు, రజినీకాంత్ సార్ నంబర్ వన్ అని అనవచ్చు కదా అంటూ రజినీ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ లో మరో రజినీకాంత్ అవ్వాలని విజయ్ భావిస్తున్నారని.. అందుకే ఫ్యాన్స్ నంబర్ వన్ హీరో అని అంటుంటే.. టాప్ హీరోలా ఫీలవుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్ హవా నడుస్తున్న మాట వాస్తవమే. అయితే తమ హీరోని మించిన హీరో లేడని, తమ హీరో తోపని, తురుమని విజయ్ ఫ్యాన్స్ అనడమే రజినీకాంత్ ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది. విజయ్ ఫ్యాన్స్.. అజిత్, రజినీకాంత్ వంటి హీరోలని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడంటే విజయ్ స్టార్ డమ్ తెచ్చుకున్నారు గానీ.. రజినీకాంత్, అజిత్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో స్టార్లుగా ఉన్నారు. రజినీకాంత్ ఇమేజ్ గురించి, క్రేజ్ గురించి ఐతే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా రజినీకాంత్ కి గుర్తింపు ఉంది. అసలు రజినీకాంత్ ని మించిన హీరో లేడు, రాడు, ఇకపై ఉండబోడు అనేది ఫ్యాన్స్ తో పాటు అందరూ అంగీకరించే మాట.
కానీ ఈ విషయాన్ని హీరో విజయ్ అంగీకరించకపోవడం, తానే నంబర్ వన్ హీరో అనేలా ఫీలవ్వడం వంటివి అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. దీనికి తోడు దిల్ రాజు లాంటి వాళ్ళు విజయ్ నే నంబర్ వన్ అని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా విజయ్, రజినీకాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవకు ఆజ్యం పోసినట్టు అయ్యింది. విజయ్ కి రజినీకాంత్ గురించి తెలియదేమో.. ఒకసారి రజినీకాంత్ సినిమాలు చూడాలంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ కి ఒకరే సూపర్ స్టార్, ప్రపంచానికి ఒకరే రజినీకాంత్.. అది కేవలం రజినీకాంత్ మాత్రమే అని, మరో రజినీకాంత్ అనే ఊహే తమకు లేదని అంటున్నారు.
ఈ అంకెలు అనేవి ఏడాదికోసారి మారుతూ ఉంటాయి. కానీ రజినీకాంత్ అనే బ్రాండ్ ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఈ ఏడాది విజయ్ నంబర్ వన్ గా ఉంటే, వచ్చే ఏడాది అజిత్ ఉండచ్చు, లేదా వేరే హీరో ఉండచ్చు. రజినీకాంత్ మాత్రం నంబర్ వన్ కి పైన ఉండే హీరో అని.. ఈ నంబర్లతో ఆయనకి పని లేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి కోలీవుడ్ నంబర్ వన్ హీరో విజయ్ అని అనడంపై మీ అభిప్రాయం ఏమిటి? విజయ్ నిజంగానే రజినీకాంత్ ని మించిన హీరోనా? విజయ్ నే నంబర్ వన్ అనే భ్రమలో విజయ్ ఫ్యాన్స్ ఉన్నారా? లేక ఈ నంబర్ 1, నంబర్ 2 లు కేవలం తాత్కాలికమేనా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.