'లోకి సినిమాటిక్ యూనివర్స్' నుండి నెక్స్ట్ రాబోతున్న దళపతి67(లియో) మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ యూనివర్స్ లో డైరెక్టర్ లోకేష్.. ఒక్కో మెయిన్ క్యారెక్టర్ యూనిక్ పేర్లతో పాటు స్పెషల్ గా జంతువులు, పక్షులతో సింబాలిక్ గా పోల్చడం మనం చూస్తున్నాం. అలా విక్రమ్ లో కమల్ హాసన్ ని ఈగల్(గద్ద)తో.. రోలెక్స్ ని స్కార్పియో(తేలు)తో.. సంతానంని కోబ్రా పాముతో.. తాజాగా లియోని లయన్(సింహం)తో అభివర్ణించారు.
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ అవుతున్న దర్శకులలో లోకేష్ కనకరాజ్ ఒకరు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో యూనివర్స్ ని క్రియేట్ చేసి ఒక్కో స్టార్ హీరోని అందులోకి తీసుకొస్తున్నాడు. ఇప్పటికే ఖైదీ సినిమాతో కార్తీని.. విక్రమ్ తో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ లను ఇంట్రడ్యూస్ చేశాడు. గతేడాది విడుదలైన విక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ.. రూ. 430 కోట్లకు పైగా వసూల్ చేసింది. దీంతో ‘లోకి సినిమాటిక్ యూనివర్స్’ నుండి నెక్స్ట్ రాబోతున్న దళపతి67(లియో) మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ప్రెజెంట్ విజయ్ తో లియో షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు లోకేష్.
ఇటీవల ‘లియో బ్లడీ స్వీట్’ టైటిల్ టీజర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసిన లోకేష్. దీంతో ఖైదీ, విక్రమ్ లకు లింక్ ఉందని కన్ఫర్మ్ అయ్యేసరికి.. ఆల్రెడీ లోకి యూనివర్స్ లో ఉన్న డిల్లీ(కార్తీ), విక్రమ్(కమల్ హాసన్), రోలెక్స్(సూర్య) క్యారెక్టర్స్ కి లింక్ ఎలా ఉండబోతుందని అంచనాలు వేస్తున్నారు ఫ్యాన్స్. అయితే.. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో డైరెక్టర్ లోకేష్.. ఒక్కో మెయిన్ క్యారెక్టర్ యూనిక్ పేర్లతో పాటు స్పెషల్ గా జంతువులు, పక్షులతో సింబాలిక్ గా పోల్చడం మనం చూస్తున్నాం. అలా విక్రమ్ లో కమల్ హాసన్ ని ఈగల్(గద్ద)తో.. రోలెక్స్ ని స్కార్పియో(తేలు)తో.. సంతానంని కోబ్రా పాముతో.. తాజాగా లియోని లయన్(సింహం)తో అభివర్ణించారు.
ఈ క్రమంలో లియో టీజర్ లో పాము తల తెగిపడటం మనం చూశాం. దీంతో విక్రమ్ లో సంతానం(విజయ్ సేతుపతి) ఇంకా చనిపోలేదని.. తిరిగి లియోలో కనిపిస్తాడని అనుమానాలు మొదలయ్యాయి. పైగా పాము లియో వద్ద చనిపోయింది కాబట్టి.. ఇప్పుడు దళపతి సినిమాలో ఖచ్చితంగా విజయ్ సేతుపతి ఉంటాడని, లియో చేతిలోనే చస్తాడని ఓ నిర్ణయానికి వచ్చేశారు నెటిజన్స్. విక్రమ్ లో అయితే సంతానం చనిపోయినట్లు చూపించారు. ఇలాంటి తరుణంలో లియో మూవీకి డైలాగ్ రైటర్ గా వర్క్ చేస్తున్న రత్నకుమార్ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. కాశ్మీర్ లో ప్రెజెంట్ లియో షూట్ జరుగుతోంది. అక్కడి షూట్ లొకేషన్ నుండే రత్నకుమార్ ట్విట్టర్ లో ఓ పిక్ షేర్ చేశాడు.
రత్నకుమార్ పోస్ట్ లో విరిగిపోయిన కళ్ళజోడు అద్దాన్ని చూపిస్తూ.. ఎప్పుడూ చావదు! అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో విక్రమ్ మూవీలో విజయ్ సేతుపతికి కళ్ళజోడు అలవాటు.. పైగా కళ్ళజోడు నుండి ఒక అద్దం తీసి చూపిస్తాడు. ఇప్పుడు విరిగిన అద్దాన్ని రత్నకుమార్ చూపించేసరికి.. సినిమాలో సంతానం క్యారెక్టర్ ఉంటుందని.. ఇంకా చావలేదు కొనసాగుతుందని ఫ్యాన్స్ చెప్పకనే చెబుతున్నారు. అంతేగాక రత్నకుమార్ పోస్ట్ ని, ఆ విరిగిన కళ్ళజోడు అద్దాన్ని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. పైగా ‘సంతానం ఈజ్ బ్యాక్’ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది నిజమా కాదా? దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందేమో చూడాలి.
ఇదిలా ఉండగా.. దళపతి విజయ్, విజయ్ సేతుపతి ఇదివరకే ‘మాస్టర్’ సినిమాలో తలపడ్డ సంగతి తెలిసిందే. అందులో జేడీ – భవాని క్యారెక్టర్స్ లో నటించి.. సినిమాని నిలబెట్టారు. పైగా ఆ సినిమాని తెరకెక్కిచ్చింది కూడా లోకేష్ కనకరాజే కావడం విశేషం. అందులో ఇందులో ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా ఇంటెన్స్ తో ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉన్నాయి. సో.. ఈసారి లియోలో కూడా ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ ఉండబోతుందని.. టీజర్ లో చూపించినట్లుగా లియో దగ్గరే కోబ్రా(సంతానం) క్యారెక్టర్ చనిపోతుందని అంటున్నారు. ఎల్ సియూలో పాము కోబ్రా అంటే విజయ్ సేతుపతి. సో.. చూడాలి మరి మున్ముందు ఫ్యాన్స్ అంచనాలు నిజం అవుతాయో లేక లోకేష్ సర్ప్రైజులు ప్లాన్ చేశాడేమో! ఇక ఈసారి లియోలో విజయ్ కి జోడిగా త్రిష నటిస్తోంది. మరి సంతానం క్యారెక్టర్ పై, ‘లోకి సినిమాటిక్ యూనివర్స్’ పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి.
Never say die 👊#Leo#Kashmir#ShootingDiaries pic.twitter.com/91lnvpTR0Q
— Rathna kumar (@MrRathna) February 19, 2023
Sandhanam Is Back #Leo 🥵🔥 @actorvijay #Varisu pic.twitter.com/W1fmdTh7fp
— Tнαℓαραтну Aмαℓ ᵛᵉᵗʳⁱᵐᵃᵃʳᵃⁿ📍 (@Marsh_Mello___) February 19, 2023