'లోకి సినిమాటిక్ యూనివర్స్' నుండి నెక్స్ట్ రాబోతున్న దళపతి67(లియో) మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ యూనివర్స్ లో డైరెక్టర్ లోకేష్.. ఒక్కో మెయిన్ క్యారెక్టర్ యూనిక్ పేర్లతో పాటు స్పెషల్ గా జంతువులు, పక్షులతో సింబాలిక్ గా పోల్చడం మనం చూస్తున్నాం. అలా విక్రమ్ లో కమల్ హాసన్ ని ఈగల్(గద్ద)తో.. రోలెక్స్ ని స్కార్పియో(తేలు)తో.. సంతానంని కోబ్రా పాముతో.. తాజాగా లియోని లయన్(సింహం)తో అభివర్ణించారు.
సాధారణంగా సినిమా చూసి థియేటర్ నుండి బయటికి వచ్చినప్పుడు.. ఆ సినిమా తాలూకు హైలైట్స్ అన్నీ ఒకసారి అలా మైండ్ లో వచ్చి వెళ్తుంటాయి. వాటిలో మూవీలోని హై మూమెంట్స్ ఉండవచ్చు లేదా ఏవైనా క్యారెక్టర్స్ కూడా ఉండవచ్చు. అలాంటి క్యారెక్టర్స్ ప్రేక్షకులను చాలా సర్ప్రైజ్ చేస్తుంటాయి. విశ్వనటుడు కమల్ హాసన్ – దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్. ఈ సినిమాలో ఎన్ని హైలైట్స్ ఉన్నా.. ఏజెంట్ టీనాని […]