టాలీవుడ్ లో కొన్ని హిట్ పెయిర్స్ ఉన్నాయి. రీల్ లైఫ్ లో స్క్రీన్ మీద జంటగా కనిపించిన ఆ జంట.. రియల్ లైఫ్ లో కూడా ఒకటైతే చూడాలని చాలా మంది కోరుకుంటారు. అలా కోరుకున్న జంటల్లో ప్రభాస్, అనుష్క జంట ఒకటి కాగా.. మరొక జంట రష్మిక, విజయ్ దేవరకొండ జంట. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే జనాలకి భలే క్రేజ్. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఈ ఇద్దరిదీ మంచి జోడి అన్న పేరు ఉంది. అలాంటి ఈ ఇద్దరూ ఒకటైతే బాగుంటుందన్న అభిప్రాయాలు వచ్చాయి. దీనికి తోడు ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందన్న రూమర్లు వచ్చాయి.
రూమర్లకు తగ్గట్టే విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడం.. విజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు పోస్ట్ చేయడం వంటివి వీళ్ళ రిలేషన్ కి మరింత ఆద్యం పోశాయి. తాజాగా మరోసారి వీరి రిలేషన్ బయటపడిందంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం రష్మిక షేర్ చేసిన వీడియోనే. కొత్త సంవత్సరం సందర్భంగా మాల్దీవుల్లో డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఫ్యాన్స్ తో లైవ్ లో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన చాలా ప్రశ్నలకు జవాబు ఇచ్చింది. అయితే రష్మిక లైవ్ లో మాట్లాడుతుండగా మధ్యలో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది. రష్మిక వయసు ఎంత అని ఫ్యాన్స్ అడుగగా.. రష్మిక 26 అని చెబుతుంది. సరిగ్గా అప్పుడే విజయ్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్న వాయిస్ వినిపిస్తుంది.
దీంతో రష్మిక, విజయ్ ఇద్దరూ ఒకే చోట ఉన్నారంటూ నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. దీనికి తోడు ఇద్దరూ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి ఇద్దరూ ఒకే చోట ఉన్నారని హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఇలా వీడియోలో విజయ్ వాయిస్ వినబడడంతో పక్కపక్కనే ఉన్నారని సోషల్ మీడియాలో ఈ జంటపై ట్రోల్స్ చేస్తున్నారు. మా మధ్య ఏమీ లేదు అని చెప్పుకునే వీరు.. కలిసి వెళ్లిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టడం అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రతీది అందరికీ చెప్పి చేయాలా? ఏంటి? అని కొందరు ఈ జంటకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. స్నేహితులుగానే వెకేషన్ కి వెళ్లి ఉండవచ్చు కదా అని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటి? ఫ్రెండ్లీ వెకేషన్ అంటారా? లేక సంథింగ్ సంథింగ్ ఉందని అంటారా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.