నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆహా OTT వేదికగా ‘అన్ స్టాపబుల్ విత్ NBK‘ అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆహాలో జరిగిన అన్ని ఎంటర్టైన్మెంట్ షోలలోకెల్లా బాలయ్య షోనే ‘నెంబర్ వన్’ టిఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుండటం విశేషం. ఇప్పటికే టాలీవుడ్ సంబంధించి చాలామంది సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొని బాలయ్యతో ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
తాజాగా రానా పాల్గొన్న ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. జనవరి 7న రానా ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది. ఇప్పటివరకు ‘అన్ స్టాపబుల్’ షో 7 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరో 3 ఎపిసోడ్ లతో ‘అన్ స్టాపబుల్’ మొదటి సీజన్ పూర్తికానుంది. తాజాగా ‘అన్ స్టాపబుల్’ టాక్ షో అదిరిపోయే రెస్పాన్స్ రాబట్టుకొని IMDB రేటింగ్స్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. బాలయ్య అటు వెండితెరపై మాత్రమే కాదు ఇటు డిజిటల్ తెరపై కూడా రికార్డుల ఎంత మోగించగలనని నిరూపించాడు.ఇండియన్ మూవీ డేటా బేస్(IMDB) రిలీజ్ చేసిన రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీ.. టాప్ 10 రియాలిటీ షోల్లో ఒకటిగా నిలిచి రికార్డు సెట్ చేసింది. దేశవ్యాప్తంగా రేటింగ్ పొందిన రియాలిటీ షోలలో టాప్ 10లో తెలుగు నుండి అన్‌స్టాపబుల్ ఒకటే నిలిచింది. ఇదిలా ఉండగా.. అన్‌స్టాపబుల్ బాలయ్యతో తదుపరి ఎపిసోడ్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొంటున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి బాలయ్య – విజయ్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అసలే ఊపులో ఉన్న బాలయ్యతో లైగర్ కలిస్తే ఎలా ఉంటుందో చూసేందుకు ఫ్యాన్స్ సైతం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్ ప్రోమో రావాల్సి ఉంది. ఇక రికార్డులతో దూసుకుపోతున్న బాలయ్య టాక్ షో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.