ఇటీవల సినీ ఇండస్ట్రలో వరుస మరణాలు విషాదంలో ముంచేస్తున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో అటు వారి కుటుంబ సభ్యులు ఇటు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. గత ఏడాది టాలీవుడ్, బాలీవుడ్ లో దిగ్గజ నటులు కన్నుమూశారు. ఈ ఏడాది కూడా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాము ఎంతగానో అభిమానించే సినీ తారులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు సమీర్ ఖాన్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ ప్రముఖ నటుడు సమీర్ ఖాన్ ముంబైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. 80వ దశకంలో డీడీ ఛానల్ లో వచ్చిన నుక్కడ్‌లో ఖోప్రీ పాత్రతో బాగా పేరు తెచ్చుకున్నారు సమీర్ ఖాన్. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ అందరి మనసు దోచుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు రంగస్థలం, చలన చిత్ర, టీవీ షోలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు సమీర్ ఖాన్. గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటున్న ఆయన 1996 లో యూఎస్ఏ కి వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. ఇటీవల మల్లీ తిరిగి భారత్ కి వచ్చారు. సల్మాన్ ఖాన్ చిత్రం జై హో చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది.
సమీర్ సోదరుడు గణేష్ మాట్లాడుతూ.. ‘సమీర్ ఖాన్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. నిన్న ఉదయం శ్వాస కోస సమస్యతో బాధపడ్డారు. వెంటనే డాక్టర్ ని ఇంటికి పిలిచాము.. డాక్టర్ అతని పరిస్థితి బాగాలేదని.. వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలని చెప్పారు. వెంటనే సమీర్ నీ ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చేర్చాము. అప్పటికే ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు’ అని అన్నారు. 80వ దశకంలో క్యారెక్టర్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమీర్ ఖాన్ సర్కస్, నయా నుక్కడ్, శ్రీమాన్ శ్రీమతి, మణిరంజన్, అదాలత్ లాంటి టీవీ సీరియల్స్ లో నటించారు. హసీ టు ఫేసీ, పటేల్ కో పంజాబీ షాదీ, పుష్పక్, పరిందా, షాహెన్‌షా, జై హూ వంటి చిత్రాలలో కనిపించాడు. సమీర్ ఖాన్ కి సినీ ప్రముఖులు నివాళులర్పించారు.
Veteran actor Sameer Khakhar passes away, confirms his brother Ganesh Khakhar pic.twitter.com/QWpYEJ8m24
— OTV (@otvnews) March 15, 2023