సినిమాల ట్రెండ్ ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటుంది. ‘బాహుబలి’ తర్వాత అన్నిచోట్ల పీరియాడిక్ చిత్రాల తీస్తూ వచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో మాత్రం ‘డ్రగ్స్’ నేపథ్యంగానే ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. గతేడాది వచ్చిన ‘విక్రమ్’ కావొచ్చు, రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ కావొచ్చు. ఈ తరహా కాన్సెప్ట్ తోనే తీశారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో సీనియర్ హీరో యాడ్ అయినట్లు తెలుస్తోంది. ఆయనే విక్టరీ వెంకటేష్. ‘సైంధవ్’ అనే కొత్త సినిమాను ప్రకటించారు. గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయగా.. అది ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తోంది.
ఇక విషయానికొస్తే.. విక్టరీ వెంకటేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే తెలుగులో ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే వెంకీమామకు కచ్చితంగా ఫ్యాన్స్ అయి ఉంటారు. ఎందుకంటే కామెడీ, ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ ఎక్కువగా చేసే వెంకీ.. ప్రతి ఒక్కరినీ ఎంటర్ టైన్ చేస్తూంటారు. కాంట్రవర్సీల్లోనూ పెద్దగా ఉండరు కాబట్టి వెంకీని ప్రేమించేవారు చాలామంది ఉంటారు. 2021లో నారప్ప, దృశ్యం 2 మూవీస్ చేసిన వెంకటేష్.. గతేడాది ‘ఎఫ్ 3’ సినిమాతో వచ్చారు. ‘ఓరి దేవుడా’లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. అయితే గత కొన్నేళ్ల నుంచి నార్మల్ గా మూవీస్ చేస్తూ వస్తున్న వెంకీమామకు సరైన మాస్ బొమ్మ పడి చాలాకాలమైంది. అప్పట్లో ‘శత్రువు’, ‘గణేష్’, ‘ధర్మచక్రం’లో వెంకీమామ ఫుల్ రగ్గ్ డ్ రోల్స్ లో కనిపించారు.
ఇప్పుడు అలాంటి రోల్ లో వింటేజ్ వెంకీని గుర్తుచేసేలా ‘సైంధవ్’ లుక్ కనిపిస్తుంది. ఇది వెంకీమామ 75వ సినిమా కావడం మరో విశేషం. ఇక ‘హిట్’ వర్స్ సినిమాలతో ఫేమస్ అయిన శైలేష్ కొలను దీనికి దర్శకుడు కావడం, గ్లింప్స్ కూడా ఫుల్ మాసీగా ఉండటంతో ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఇకపోతే గ్లింప్స్ లో ‘Onasemnogene abeparvovec’ డ్రగ్ ని ప్రధానంగా చూపించారు. దీని చుట్టూనే కథంతా ఉండదనుందని తెలుస్తోంది. అయితే వికిపీడియాలో దొరికిన సమాచారం ఆధారంగా ఈ మందుని.. జన్యుపరమైన సమస్యలు ఎదుర్కొనే 2 ఏళ్ల లోపు పిల్లల కోసం ఉపయోగిస్తారని తెలుస్తోంది. దీని ట్రీట్ మెంట్ కాస్ట్ దాదాపు రూ.14 కోట్లు విలువ చేస్తుందని సమాచారం. దీన్నిబట్టి చూస్తుంటే.. విక్రమ్ తరహాలో ఉండే యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సైంధవ్’ అని తెలుస్తోంది. దీనిని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. సో అదన్నమాట విషయం.. మరి వెంకీ కొత్త సినిమాలో లుక్, గ్లింప్స్ ఎలా అనిపించాయి. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.