తెలుగు స్టార్ హీరోలు.. సినిమాలు, వాటి ప్రమోషన్స్ లో తప్పించి పెద్దగా బయట కనిపించరు. ఒకవేళ కనిపిస్తే మాత్రం ఆయా వీడియోలు తెగ వైరల్ అయిపోతాయి. ఇకపోతే హీరో నాగచైతన్య చాలాకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగానే ఉంటున్నారు. దానికి కారణాలు ఏంటనేవి పక్కనబెడితే.. సినిమా పోస్టర్లు, వీడియోలు తప్పించి పెద్దగా పోస్టులు పెట్టడు. అలాంటి నాగచైతన్య ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఎందుకంటే ఓ వీడియోలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో కుమార్తెతో కలిసి వీడియోలు తెగ సందడి చేశాడు. దీంతో ఈ ఇది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది బంగార్రాజు, థాంక్యూ, లాల్ సింగ్ చద్దా సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన నాగచైతన్య.. ‘కస్టడీ’ అనే ద్విభాషా మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ తో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. యాక్టింగ్ గురించి పక్కనబెడితే.. చైతూకి హైదరాబాద్ లో ఓ క్లౌడ్ కిచెన్ ఉంది. దీని ద్వారా పాన్ ఏసియన్ ఫుడ్ ని డెలివరీ చేస్తుంటారు. కొన్నాళ్ల క్రితం దీనిని ప్రారంభించగా.. ఆహార ప్రియుల నుంచి దీనికి ఆదరణ బాగానే వచ్చింది. ఇప్పుడు హీరో వెంకటేశ్ కూతురు ఆశ్రిత… చైతూ రెస్టారెంట్ లో సందడి చేసింది. ఆమెనే ఓ స్పెషల్ ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసి చైతూకి తినిపించింది. అలానే బావ బావ అని పిలుస్తూ ఈ వీడియోలో కనిపించింది. దీనిని తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేయగా.. నెటిజన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
ఇక ఆశ్రిత విషయానికొస్తే.. యూకేలో చదువుకున్న ఆమె.. తన ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ వైపు అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అందరి కంటే భిన్నంగా ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ అయింది. ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో ఇన్ స్టా, యూట్యూబ్ ఛానెల్స్ రన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య ఆర్గనైజ్ చేస్తున్న ‘షోయూ’లో సందడి చేసింది. ‘ఫన్ డే అమేజింగ్ ఫీస్ట్ ఎట్ షోయూ విత్ మై బావ’ అనే క్యాప్షన్ తో ఈ మొత్తం వీడియోని యూట్యూబ్ లో షేర్ చేసింది. మరి హీరో వెంకటేశ్ కూతురు ఆశ్రిత, నాగచైతన్యతో చేసిన వీడియో మీకెలా అనిపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.