తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేశావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి చిత్రం సూపర్ హిట్ కావడంతో సమంతకు స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు వచ్చాయి. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించింది. కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టకుండా వెబ్ సీరీస్ లో నటిస్తూ బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతుంది. ఏం మాయ చేసావే చిత్రంలో నటించిన అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అక్కినేని ఫ్యామిలీకి కోడలు కావడంతో సమంత రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కొన్ని కారణాల వల్ల నాగ చైతన్యకు దూరమైంది సమంత.
ఆ మద్య సమంతకు అనారోగ్య సమస్య రావడంతో సినిమాలను పక్కనబెట్టి ట్రీట్ మెంట్ చేయించుకుంది. ఆరోగ్యం బాగుపడిన తర్వాత మళ్లీ సినిమాల్లో నటించింది. నాగ చైతన్యకు దూరమైన తర్వాత సమంతపై ఎంతో మంది విమర్శకులు రక రకాలుగా కామెంట్స్ చేశారు. కానీ వాటిని ఏమాత్రం పట్టించకోకుండా మనోధైర్యంతో ముందుకు సాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలో షాకింత్ వార్త చెప్పింది. ప్రస్తుతం సమంత వయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఫోటో షేర్ చేస్తూ తెలిపింది. ఇది చూసి ప్రేక్షకులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రెటీలు, ఫ్యాన్స్ ఆమె ఆరోగ్యంతో కోలుకొని సంతోషంగా బయటికి రావాలని ప్రార్థిస్తున్నారు.
సమంత చేసిన పోస్ట్ కి ఎంతో మంది ధైర్యం చెబుతూ.. హార్ట్, లవ్ ఎమోజీలతో పోస్ట్ లు పెడుతూ క్షేమంగా రావాలని పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా సమంత పోస్ట్ కి విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత దగ్గుబాటి స్పందిస్తూ.. ‘నీ గురించి నీకు తెలియదు సమంత.. నీలో ఎంతో ధైర్యం ఉంది.. నీ శక్తి గురించి నీకు తెలియదు.. అనంతమైన ప్రేమను నీకు పంపుతున్నా సమంతా ’ అంటూ ఇన్ స్ట్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.