మెగా ఇంట సందడి నెలకొంది. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠీతో స్టార్ హీరో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులతో పాటు కొందరు అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారు.
తెలుగు యంగ్ హీరోల్లో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారిలో మెగా హీరో వరుణ్ తేజ్ ఒకరు. మూస ధోరణిలో సినిమాలు చేయకుండా.. వైవిధ్యం ఉన్న కథలు, పాత్రలకు ఆయన ప్రాధాన్యం ఇస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదటి నుంచి వరుణ్ అలాంటి సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ‘కంచె’, ‘ఫిదా’ వంటి మూవీస్‌ను దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక, టాలీవుడ్లో తక్కువ సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు లావణ్య త్రిపాఠి. గ్లామర్ కంటే కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్‌కు ఆమె ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ‘అందాల రాక్షసి’, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాల్లో యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారామె. అయితే కొన్నాళ్లుగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లిపీటలు ఎక్కుతారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపించింది. ఎట్టకేలకు ఇది నిజమేనని తేలింది. వరుణ్-లావణ్య ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ అని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. శనివారం వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. హైదరాబాద్ మణికొండలోని మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో అత్యంత సన్నిహితుల నడుమ వరుణ్-లావణ్య ఉంగరాలు మార్చుకున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, ఉపాసనతో పాటు అల్లు అరవింద్, అల్లు అర్జున్, అంజనా దేవి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ హాజరయ్యారు. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. కాగా.. ఈ సంవత్సరం చివర్లో వరుణ్-లావణ్య వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం.
Found my Lav!♥️@Itslavanya pic.twitter.com/OCyhWcIjMq
— Varun Tej Konidela (@IAmVarunTej) June 9, 2023