ఉర్ఫీ జావెద్.. ఈ పేరు వినగానే కాంట్రవర్సీలు, ఫ్యాషన్ డ్రెస్సులే గుర్తొస్తాయి. నిత్యం ఫ్యాషన్ డెస్సులు వేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించే ఉర్ఫీ గురించి బాలీవుడ్‌లో తెలియని వారుండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె రోజూ ఏదో ఒక వింత డ్రెస్ వేసుకుని వీధుల్లోకి వచ్చేస్తుంది. మీడియా, సోషల్ మీడియాలో అవీ కాస్తా వైరల్ అవుతుంటాయి.
ఈమెని ఎవరైనా ప్రశ్నిస్తే.. స్టార్ హీరోయిన్లు వేసుకుంటే తప్పులేదు గానీ, నేను వేసుకుంటే తొప్పొచ్చిందా అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది. ఇన్నాళ్లు ఒకలెక్క గానీ ఇప్పుడు ఉర్ఫీ జావెద్ మరీ హద్దులు దాటేసింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. ఫ్యాషన్ డ్రెస్ పేరుతో చుట్టూ ఏదో వైర్లలాంటివి చుట్టుకుని చేతులు అడ్డుగా పెట్టుకుంది. ఇప్పుడు ఆ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.
అసలు వైరల్ అయ్యేందుకు, వీళ్ల గురించి మాట్లాడుకునేలా చేసుకునేందుకు ఇంతలా దిగజారాలా అంటూ ప్రశ్నస్తున్నారు. ఇంకొంతమంది రానురాను ఈమె డ్రెస్సింగ్ సెన్స్ తో విసిగించేస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొంత మంది అసలు అదేం ఫ్యాషన్ అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2 లక్షలకు పైగా లైకులు, 12 వేలకు పైగా కామెంట్స్‌తో రచ్చ రచ్చ చేస్తోంది. ఉర్ఫీ జావెద్ డ్రెస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.