నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్‌స్టాపబుల్ షో సినిమాలకు మించి రికార్డులు సృష్టిస్తోంది. ఈ షో ఇంత భారీ రేంజ్లో విజయం సాధించడానికి ప్రధాన కారణం బాలయ్య. ఈ షో ద్వారా సరికొత్త బాలయ్య ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ వయసులో కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా, సరదాగా మాట్లాడుతూ.. అల్లరి చేస్తూ.. వచ్చిన వారిని ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధిస్తూ.. ఇలా ఒక్కటేంటి.. బాలయ్య అల్లరే షోకు ప్రధాన ఆకర్షణ అని చెప్పడంలో ఎంత మాత్రం అనుమానం లేదు. అన్‌స్టాపబుల్ సీజన్ 1 సాధించిన భారీ విజయంతో.. ఆహా టీం సీజన్ 2ను ప్రాంరభించింది. తొలి ఎపిసోడ్‌కు చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు హాజరవ్వడంతో ఆ ఎపిసోడ్ సంచలనాలు సృష్టించింది. ఇక మూడో ఎపిసోడ్ నవంబర్ 4న స్ట్రీమ్ కానుంది. ఈ సారి యంగ్ హీరోలు అడవి శేష్, శర్వానంద్ గెస్ట్లుగా వచ్చారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. తాజాగా మరోడో ప్రోమో విడుదలయ్యింది. దీనిలో శర్వానంద్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఆ వివరాలు..
ఈ ప్రోమోలో శర్వానంద్.. బాలకృష్ణ చేసుకున్న ఒక పార్టీ గురించి చెప్పుకొచ్చాడు. పార్టీలో భాగంగా.. బాలయ్య, మరో అమ్మాయి డ్యాన్స్ వేయడానికి రెడీ అయ్యారు. ఐదున్నర నిమిషాల నిడివి ఉన్న ఒక పాటకు బాలకృష్ణ, ఆ అమ్మాయి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అయితే మూడున్నర నిమిషాలు అవ్వగానే ఆ అమ్మాయి ఆగిపోయింది. కానీ బాలకృష్ణ మాత్రం ఆ పాట పూర్తవ్వగానే.. కమాన్.. నెక్స్ట్ సాంగ్ ప్లీజ్ అంటూ ఇంకో పాట వేయమన్నారని, బాలయ్య ఎనర్జీ అంటే అది అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పవద్దు, ప్లీజ్ అంటూ బాలకృష్ణ, శర్వాను కామెడీగా రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఇంతకు ముందు రిలీజ్ చేసిన ప్రోమోలో రష్మికకు శర్వా వీడియో కాల్ చేసి బాలకృష్ణతో మాట్లాడించారు. రష్మిక తన క్రష్ అంటూ గతంలో బాలయ్య.. ఆమెపై తనకున్న అభిమానాన్ని బయట పెట్టారు. దాంతో శర్వా.. రష్మికకు వీడియో కాల్ చేసి బాలయ్యతో మాట్లాడించాడు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌తో కలిసి ‘పుష్ప’ విడుదల సమయంలో ‘అన్‌స్టాపబుల్’కు వచ్చింది రష్మిక. అప్పుడు బాలకృష్ణ ఆమెతో చాలా సరదాగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎపిసోడ్ నవంబర్ 4 అనగా ఈ రోజే స్ట్రీమ్ కానుంది. మరి బాలయ్య యంగ్ హీరోలను ఎలాంటి ప్రశ్నలు అడిగాడు.. ఇంకేం సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయో తెలియాలంటే.. ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకు వేచి చూడాలి.