తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. జనవరి 27న సీనియర్ నటి జమున మరణించారు. అదే రోజున ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కూడా మరణించారు. వీరిద్దరి మరణం నుంచి ఇండస్ట్రీ కోలుకోకముందే.. దెబ్బ మీద దెబ్బలా మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ గురువారం రాత్రి మరణించారు. వయోభార అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. కే విశ్వనాథ్ మరణించిన రెండవ రోజే ప్రముఖ సింగర్ వాణీజయరాం కన్నుమూశారు. ఆమె 77 ఏళ్ల వయసులో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
వాణీ జయరాం మృతిలో ట్విస్ట్ !
సింగర్ వాణీ జయరాం మృతిలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మొదట ఆమె మరణానికి వయోభార అనారోగ్య సమస్యలు కారణమని అందరూ భావించారు. అయితే, ఆమె మరణించడానికి కారణం అది కాదని తెలుస్తోంది. వాణీ జయరాం మరణించే సమయంలో ఆమె ముఖంపై గాయాలు ఉన్నట్లు సమాచారం. ఆమె నుదురుపై గాయాలు ఉన్నాయట. అయితే, ఆ గాయాలు ఏంటి? ఆమె కిందపడటంతో తలకు గాయాలు తగిలి చనిపోయారా? లేక ఎవరైనా ఆమెను కొట్టారా? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
కాగా, వాణీ జయరాం తమిళనాడులోని వేళ్లూరు ప్రాంతంలో పుట్టారు. వాణీ జయరాం అసలు పేరు కళైవాణి. ఆమెది సంగీత అభిలాష ఉన్న కుటుంబం. దీంతో తల్లిదండ్రులు ఆమెకు చిన్నప్పుడే సంగీతంలో శిక్షణ ఇప్పించారు. 1969లో జయరామ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. 1971లో ఆమె సినిమా రంగ ప్రవేశం చేశారు. తన పేరు తర్వాత భర్త పేరును పెట్టుకుని వాణీ జయరాంగా సుపరిచితులయ్యారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 10 వేల పాటలు పాడారు. మరి, ప్రముఖ సింగర్ వాణీ జయరాం మరణంపై మీ సంతాపాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.