ఆమె చాలా ఫేమస్. హీరోయిన్ గా చాలా పేరు తెచ్చుకుంది. లక్షలాది మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటి ఆమె సడన్ గా ఆస్పత్రి బెడ్ పై కనిపించేసరికి అందరూ షాకవుతున్నారు.
ఈ మధ్య ఎవరి ఆరోగ్యాలు అస్సలు బాగుండటం లేదు. ఎక్కడా చూసినా జ్వరాలు, దగ్గు, జలుబు లాంటివి వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ మినహాయింపు కాదు. తాజాగా ప్రముఖ హీరోయిన్ కూడా ఆస్పత్రిపాలైంది. కిడ్నీ సమస్య ఎక్కువ కావడంతో షూటింగ్స్ అన్ని ఆపేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తన అనారోగ్యం గురించి వాళ్లు వీళ్లు చెప్పడం ఎందుకు? తానే చెప్పేయాలని ఫిక్స్ అయిపోయింది. అందులో భాగంగానే ఇన్ స్టాలో ఫొటో పోస్ట్ చేసి మరి ఏం జరిగింది అనే విషయాన్ని క్లియర్ గా చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ ఎవరు? అసలు కిడ్నీ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా నటీనటుల కంటే సీరియల్ యాక్టర్స్ ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా చూసినా సరే మన వాటితో పాటు హిందీ సీరియల్స్ కూడా చూసేస్తున్నారు. అందులో భాగంగా అక్కడి భామల గురించి మనవాళ్లకు పరిచయమే. అలా ‘బాలికా వధు 2’ గుర్తింపు తెచ్చుకున్న నటి శివాంగీ జోషి. ‘ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి’ సీరియల్ తో నటిగా మారిన ఈమె.. ‘హే రిస్తా క్యా ఖేల్తా హై’ సీరియల్ తో ప్రతి ఇంట్లోనూ ఓ మనిషిలా మారిపోయింది. వీటితో పాటే బైంతేహా, బెగుసరాయి లాంటి ధారావాహికల్లోనూ నటించింది. గతేడాది టెలికాస్ట్ అయిన ‘ఖత్రోం కీ ఖిలాడీ 12’లోనూ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా పాల్గొని ఆకట్టుకుంది.
తాజాగా ఈమెకు కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేరింది. అందుకు సంబంధించిన ఫొటోని పోస్ట్ చేసిన శివాంగీ.. ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలో షూటింగ్ కు హాజరవుతానని చెప్పుకొచ్చింది. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు కూడా చెప్పింది. అందరూ వీలైనంతవరకు నీరు లాంటివి తాగి డీహైడ్రేట్ గా ఉండాలని పేర్కొంది. ఇక శివాంగీ ఆస్పత్రిలో చేరడంతో సహానటీనటులు చాలామంది ‘గెట్ వెల్ సూన్’ (త్వరగా కోలుకోవాలి) అని కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా శివాంగీ ఏక్తా కపూర్ ‘బ్యూటీ అండ్ బీస్ట్’ సీరియల్ లో నటించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ భామ కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.