నటి సంగీత అంటే ఇప్పటి జనరేషన్ వాళ్లకు పెద్దగా తెలీకపోవచ్చు గానీ.. ఓ ఇరవై ముప్పై ఏళ్ల క్రితం మూవీస్ చూసిన వాళ్లు మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అని ‘ఖడ్గం’ మూవీలో డైలాగ్ చెప్పి బాగా పాపులర్ అయింది. ఈ చిత్రంతోపాటు పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, సంక్రాంతి తదితర విజయవంతమైన చిత్రాల్లో నటించి ఫ్యామిలీ హీరోయిన్‌తో పాటు గ్లామరస్ నటిగా పేరు సంపాదించింది సంగీత. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మూవీస్ చేస్తూ, అప్పుడప్పుడు టీవీ షోల్లోనూ కనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. నటి సంగీత 2010లో కారా మజాకా మూవీలో నటించింది. ఆ తర్వాత దాదాపు పదేళ్లపాటు తెలుగు తెరపై కనిపించలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ రష్మికతో కలిసి ‘అబ్బబ్బా నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అనే సరికొత్త మేనరిజంతో ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది రిలీజైన ‘ఆచార్య’లో లాహే లాహే సాంగ్ లో కనిపించింది. ‘మసుధ’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ‘అలీతో సరదాగా’ షోకి వచ్చిన సంగీత.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
హోస్ట్ అలీ.. ‘సరిలేరు నీక్వెవరు సినిమాలో హీరోయిన్ మదర్ గా చేశావ్. అది నీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా’ అని సంగీతని అడగ్గా.. రెండూ అయిందని చెప్పింది. డైరెక్టర్ అనిల్ ని చూస్తే.. ‘రేయ్ ఇలా చేశావ్ రా నన్ను’ అని తిట్టుకుంటూనే ఉంటానని సంగీత చెప్పింది. అలానే అవకాశం వదులుకున్న సినిమాలు ఏమైనా ఉన్నాయా అని కూడా సంగీతని అడగ్గా.. ఓ సినిమా షూటింగ్ కి రెండు రోజులు వెళ్లానని, ఆ తర్వాత వాళ్లు చిత్రం నుంచి తీసేశారని కూడా చెప్పింది. ప్రోమోలో ఆ మూవీ ఏంటనేది రివీల్ చేయలేదు. కాబట్టి ఆ సినిమా ఏంటనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అనిల్ రావిపూడిపై సంగీత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: అందాలన్నీ చూపించేస్తున్న రష్మిక మందన!