యాంకర్ రష్మీ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకే కాదు.. వెండితెర ప్రేక్షకులకు కూడా ఈమె గురించి పరిచయాలు అక్కర్లేదు. నటిగా కెరీర్ ప్రారంభించి.. యాంకర్‌గా గుర్తింపు సంపాదించుకుని హీరోయిన్‌గా ఎదుగుతోంది. ఇటీవలే నందు హీరోగా.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో రష్మీ హిట్టు కొట్టింది. యాంకర్‌గా చేస్తూనే మంచి కథ వచ్చినప్పుడు హీరోయిన్‌గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జహర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీకి యాంకర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సుధీర్‌లేని సమయంలో రష్మీని.. శ్రీదేవీ డ్రామా కంపెనీ యాంకర్‌ని చేశారు. తనదైన స్టైల్ పంచులతో, యాంకరింగ్‌తో రష్మీ రెండు కార్యక్రమాలను నడిపిస్తోంది.
తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో ఒకటి విడుదలైంది. అందులో చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్‌కి రాజ్ తరుణ్, మోడల్ జెస్సీ గెస్టులుగా వచ్చారు. అంతేకాకుండా సీరియల్ ఆర్టిస్టులు, కమీడియన్లతో మంచి డాన్సులు కూడా వేయించారు. అందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో ఒక టాస్కు ఇచ్చారు. వారి గురించి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, వదంతులు, చాలా మంది థంబ్‌నెయిల్స్ ను చూపించారు. వాటిపై స్పందించాల్సిందిగా కోరారు. అందులో యాంకర్ రష్మీకి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది. అదేంటంటే ఒక ప్రముఖ హీరో తనకు విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడు అని. ఆ విషయంపై రష్మీని స్పందించాల్సిందిగా కోరారు.
అయితే యాంకర్ రష్మీ.. ఆ హీరో ఎవరు అంటే అని సమాధానం చెప్పబోయింది. కానీ, ప్రోమోలో ఆ ఆన్సర్ లేకుండా కట్ చేశారు. అయితే ఆమె సమాధానం ఏం చెప్పి ఉంటుందో మీరు కూడా గెస్ చేయచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి టాస్కులు వాళ్లకి ఇచ్చిన విషయం తెలిసిందే. ముందు ఎమోషనల్ అయినట్లు చూపించి ఆ తర్వాత.. మీకు నచ్చింది రాసుకోండి అంటూ ఘాటుగా స్పందించారు. అయితే ఈసారి మాత్రం రష్మీ కూడా ఎమోషనల్ అయినట్లు కనిపించింది. తమపై ఎందుకు ఇలాంటి వార్తలు పుట్టిస్తారు అని భావోద్వేగానికి లోనై ఉండచ్చు. అసలు ఏం చెప్పిందో తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.