పంచ్ ప్రసాద్.. జబర్దస్త్ లో తన పంచులకు ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రసాద్ పంచ్ వేశాడు అంటే దానికి కౌంటర్ ఉండదు అని మనకు తెలిసిందే. అంతలా తన టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన హెల్త్ కు సంబంధించిన అప్డేట్ తో పాటు తనకు ఆపరేషన్ ఎందుకు చేయలేదో చెప్పుకొచ్చాడు.
జబర్దస్త్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఇక ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో తన స్పాంటినియస్, టైమింగ్ తో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నాడు పంచ్ ప్రసాద్. ప్రసాద్ పంచ్ వేశాడు అంటే తిరుగుండదు అన్నది అందరికి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం మనందరికి తెలిసిందే. తన రెండు కిడ్నీలు పాడవడంతో.. ఆపరేషన్ కు రడీ అవుతున్నాడు పంచ్ ప్రసాద్. ఈ సందర్భంగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన హెల్త్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు.
పంచ్ ప్రసాద్.. జబర్దస్త్ లో తన పంచులకు ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రసాద్ పంచ్ వేశాడు అంటే దానికి కౌంటర్ ఉండదు అని మనకు తెలిసిందే. అంతలా తన టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఆ నవ్వుల వెనక ఎంతో విషాదం కూడా దాగి ఉందని మనకు తెలిసిందే. గత కొంత కాలంగా తన రెండు కిడ్నీలు పాడవడంతో.. చికిత్స తీసుకుంటున్నాడు పంచ్ ప్రసాద్. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన హెల్త్ కు సంబంధించిన అప్డేట్ తో పాటు తనకు ఆపరేషన్ ఎందుకు చేయలేదో చెప్పుకొచ్చాడు.
“పెళ్లైన కొత్తలో నా ముక్కులో నుంచి తరచుగా రక్తం రావడంతో.. ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ వైద్యులు అన్ని పరీక్షలు చేసి నా రెండు కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పారు. దాంతో పాటుగా నా ఎడమ కాలుకు చీము రావడంతో నడవలేని స్థితిలోకి వెళ్లిపోయా. ప్రస్తుతానికి నా ఆరోగ్యం బాగానే ఉంది. త్వరలోనే ఆపరేషన్ చేయించుకోబోతున్నాను. కిడ్నీ డోనర్ కూడా దొరికాడు” అని పంచ్ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇక కాలుకు చీము రావడం వల్లనే డాక్టర్లు ఆపరేషన్ వాయిదా వేశారని ప్రసాద్ తెలిపాడు. కాలు నొప్పి తగ్గగానే ఆపరేషన్ చేయించుకుంటాను అని అన్నాడు. ఇక తన ఆపరేషన్ కు సహాయం చేయడానికి పలువురు జబర్దస్త్ నటులు ముందుకు వచ్చారన్నాడు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ ఆపరేషన్ కు అయ్యే ఖర్చులను తాను భరిస్తానని ఇటీవలే ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిర్రాక్ ఆర్పీ తెలిపాడు.