బిగ్ బాస్ 2తో ఆర్మీని ఏర్పరుచుకుని.. తన వ్యూహాలతో టైటిల్ ను గెలుచుకున్నాడు కౌశల్ మండ. ఇప్పుడు బీబీ జోడితో మన ముందుకు వచ్చారు. అయితే అక్కడ కూడా తన వ్యూహాలను వినియోగిస్తూ.. మిగిలిన కంటెస్టెంట్ జోడీలు మండిపడేలా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆ షో విన్నర్ వీల్లేనంటూ రచ్చ చేస్తున్నాడు.
మోడల్, నటుడు కౌశల్ మండ అంటే ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ బిగ్ బాస్ 2 విన్నర్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించినప్పటికీ.. ఆయనకు పేరు వచ్చిందంటే మాత్రం బిగ్ బాస్ తోనే. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక సినిమా ఆఫర్లు వరుస కడతాయని భావించినప్పటికీ.. అదేమీ జరగలేదు. అడపా దడపా సినిమాలతో సరిపెట్టుకున్నాడు. బిగ్ బాస్ 2లో చాలా వ్యూహాత్మకంగా ఆడి గెలిచిన ఇతగాడు.. ప్రస్తుతం ప్రముఖ టివీ ఛానల్ లో ప్రసారమౌతున్న డాన్స్ షో బీబీ జోడిలో కంటెస్టెంటుగా ఉన్నారు. ఆయనకు జోడిగా ప్రముఖ డ్యాన్సర్, నటి అభినయశ్రీ నర్తిస్తున్నారు.
అయితే ఈ షోలో కౌశల్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. డాన్స్ ల దగ్గర నుండి తోటి కంటెస్టులకు మార్కులు ఇచ్చే వరకు ప్రతిదీ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడు. దీంతో తోటి కంటెస్టెంట్లు జోడీలు ఇప్పటికే కౌశల్ పై మండిపడుతున్నాయి. మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే.. కౌశల్-అభినయశ్రీ జంట అంతగా ఆకట్టుకోలేకపోతుంది. కేవలం అభినయశ్రీ చేస్తున్న డాన్స్ వల్లే ఆ జోడీ గట్టెక్కుతోంది. అభినయశ్రీ డాన్స్ ను కానీ, ఎనర్జీని కానీ ఆయన అందుకోలేకపోతున్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే కౌశల్.. తాను డాన్స్ చేయకపోతే.. సరిగా చేసేవాళ్లని అలా చేయలేదు.. ఇలా చేయలేదంటూ చిరాకు తిప్పిస్తూ విమర్శపాలౌతున్నాడు. మంచి ఫెర్మామెన్స్ చేసిన డాన్స్ జోడీలకు తక్కువ మార్కులు ఇచ్చి..తన ఇమేజ్ ను డామేజ్ చేసుకుంటున్నాడు.
బిగ్ బాస్ లో వినియోగించినట్లే స్ట్రాటజీలు బీబీ జోడిలో చెల్లవని ఇప్పటికే తోటి కంటెస్టెంట్ జోడీలు అఖిల్, ఫైమా, తేజస్విని కౌంటర్లు ఇస్తున్నా కౌశల్ మారడం లేదు. అవే చేష్టలు, అవే పుల్ల విరుపు మాటలు మాట్లాడుతున్నాడు. కొన్ని సార్లు జడ్జీలు తరుణ్, సదా, రాధలపై కూడా సర్ ప్రతాపం చూపారు. దీంతో చూసే వారికి సైతం కౌశల్ అంటే గౌరవం పోతుంది. దీనికి తోడు విసుగు వస్తోంది. అసలు కౌశల్ లేకపోతేనే ఈ షో బాగుంటుందనే విమర్శల నేపథ్యంలో బీబీ జోడీపైన.. ఆ షో జడ్జీలపై విషం కక్కుతూ పోస్ట్ పెట్టాడు కౌశల్. అయితే ఇప్పుడు ఈ షో విన్నర్స్ వీరేనంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు. బీబీ జోడీ వీళ్లే అవుతారంటూ రివ్యూను ఇవ్వడమే కాకుండా జడ్జిలనే విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
‘నా ఉద్దేశం ప్రకారం బీబీ జోడి విజేతలు రవి,భాను శ్రీ. ఎందుకంటే.. వాళ్లు డ్యాన్స్ చేసిన విధానం, ప్రతి రౌండ్‌లో పింక్ సీటు గెలుచుకున్న తీరు అద్భుతం. బిగ్‌బాస్ పోటీదారులుగా వారి వ్యూహాల ప్రకారం ఆడటానికి వారికి అన్ని హక్కులు ఉన్నాయి.. కానీ న్యాయనిర్ణేతలకు కాదు. వాళ్లు కేవలం డాన్స్ ఎవరు ఎలా చేశారో.. చెప్పడానికి మాత్రమే.. అంతే తప్ప డాన్సర్ల వ్యాహాలను జడ్జ్ చేయడానికి కాదు. ఏది ఏమైనా చివరికి టైటిల్ గెలిచేది రవి-భాను శ్రీలు మాత్రమే. మిగిలిన వాళ్లకి బ్యాడ్ లక్. నాకు ఏదైనా అనిపిస్తే దాన్ని దాచుకోలేను.. పైకి చెప్పేస్తాను. నిజాన్ని నా దగ్గర దాచుకుని చెడ్డవాడ్ని కాలేను.. కాబడ్డి జడ్జీలు క్షమించండి.. మీ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నా’ అని ఫేస్ బుక్‌లో వివాదాస్పద పెట్టాడు కౌశల్. అయితే ఈ పోస్టుపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. నువ్ సరిగా ముందు డ్యాన్స్
<
/p>