సుమ కనకాల.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. కొన్ని ఏళ్లుగా బుల్లితెర మీద యాంకర్ గా రాణిస్తోంది. ఆమె మాటలు గంగా నది ప్రవాహంకి మించి ఉంటాయి. బుల్లితెరపై అనేక షోల్లో తనదైన పంచ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాక సినిమాల ఈవెంట్స్ విషయంలో కూడా ఈమె ముందుంటారు. ఎప్పటి నుంచి సుమ కనకాల.. క్యాష్ షో తో తెగ సందండి చేసింది. ఇందులో ఎంతో మంది సినీ ప్రముఖులు అతిథులుగా వచ్చి అలరించారు. దాదాపు టాలీవుడ్ లోని స్టార్స్ అందరూ ఈ షోకి హజరయ్యారు. ఇటీవలే క్యాష్ ప్రోగ్రామ్ కి ఫుల్ స్టాప్ పెట్టి.. “సుమ అడ్డా” అనే కొత్త షో ను ప్రారంభించింది. అయితే ఈ షోకి కూడా క్యాష్ రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ షోలో పాల్గొన్నారు. తాజాగా సుమ అడ్డా షోకి సంబంధించి ప్రోమో విడుదలైంది. స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని సుమకి జానీ మాస్టర్ ప్రోజ్ చేస్తాడు. దీంతో సుమ ఒక్కసారిగా షాక్ అవుతోంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ప్రోమో విషయానికి వస్తే ఫుల్ ఫన్నీగా ఉంది. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లతో సుమ తెగ సందడి చేశారు. ఇదే సమయంలో జానీ మాస్టర్ పై సుమ పంచ్ ల వర్షం కురిపించింది. శేఖర్ మాస్టర్ గుర్తించడం వలనే జానీ మాస్టర్ ఇప్పుడు స్టార్ కోరియోగ్రాఫర్ ఎదిగాడని ఈ సందర్భంగా సుమ వెల్లడిస్తోంది. అలానే జానీ, శేఖర్ మాస్టర్ మధ్యలో జరిగిన ఓ ముద్దు సన్నివేశాన్ని సుమ స్క్రీన్ పై చూపించి.. వారిపై సెటైర్లు వేస్తుంది. అంతేకాక అమ్మాయిల విషయంలో శేఖర్ మాస్టర్ ఎంత సరదా ఉంటాడో అనే విషయాన్ని ఓ స్క్రిఫ్ట్ ద్వారా చూపిస్తారు. ఇదే సమయంలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సుమ కలిసి ‘ప్రేమ దేశం’ సినిమాను ఇమిటేట్ చేస్తారు. సీన్ లో భాగంగా టబు పాత్రలో సుమ పరకాయ ప్రవేశం చేసి.. సీన్లు, డైలాగ్స్ అదరగొట్టింది. నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? అని జానీ మాస్టర్ ని సుమ రిక్వెస్ట్ చేస్తుంది.
తప్పకుండా అంటూ జానీ మాస్టర్ వెంటనే సమాధానం ఇస్తారు. జానీ మాస్టర్ చిలిపి పనులు చూసి.. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని సుమ అటుంది. దీంతో వెంటనే సుమ షాక్ అయ్యే విషయం జానీ మాస్టర్ చెప్పాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని సుమకి జానీ మాస్టర్ ప్రపోజ్ చేశాడు. అంతేకాక ప్రేమ దేశం సినిమాలోని సాంగ్ కి ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తారు. ‘నేను వదిలేసిన తరువాతే వీరిద్దరికి ముద్దు ముచ్చట మొదలైంది’ అని సుమ.. జానీ , శేఖర్ మాస్టర్లను ఉద్దేశించి అంటుంది. మొత్తానికి ప్రోమో ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.