తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న పాపులర్ కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. దాదాపు 9 ఏళ్లకు పైగా జనాలను ఎంటర్టైన్ చేస్తున్న ఈ షో.. ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. ఎంతోమంది కమెడియన్స్ ని జనాలకు దగ్గర చేసింది. ఈ షో ప్రారంభం అయినప్పటి నుండి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రతీవారం కావాల్సినంత వినోదాన్ని పొందగలుగుతున్నారు. కొన్నేళ్లుగా జబర్దస్త్ తో పాటు ఎక్సట్రా జబర్దస్త్ కూడా అలరిస్తోంది. అయితే.. 9 ఏళ్ళ ప్రస్థానం కలిగిన జబర్దస్త్ లో జడ్జిలకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది.
2013లో మొదలైన జబర్దస్త్ లో ఈ మధ్య వారవారం జడ్జిలు మారిపోవడం చూస్తున్నాం. కానీ.. మొదటి నుండి షోని నిలబెట్టిన వారిలో నటి రోజా, మెగా బ్రదర్ నాగబాబు ముందుంటారు. అయితే.. షోలో కామెడీ, కంటెంట్ తో పాటు పారితోషికాలు కూడా కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఈ పారితోషికాల వల్లే నాగబాబు, రోజా షో నుండి వెళ్లిపోయారని టాక్ ఉంది. కానీ.. ఏం జరిగిందా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం జబర్దస్త్ కి జడ్జిలుగా వ్యవహరించిన వారి రెమ్యూనరేషన్స్ ఇవేనంటూ కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి.
మరి ఒక్కో ఎపిసోడ్ కి జబర్దస్త్ జడ్జిల రెమ్యూనరేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!
రోజా:
టాలీవుడ్ హీరోయిన్ గా రోజాకు భారీ ఫేమ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కో ఎపిసోడ్ కు రోజా సుమారు రూ.5 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకునేది అని సమాచారం. ఇక మంత్రి అయ్యాక జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది.
నాగబాబు:
టాలీవుడ్ లో నటుడిగా క్రేజ్ ఉన్న నాగబాబు.. జబర్దస్త్ కు జడ్జిగా ఎపిసోడ్ కు రూ.3 లక్షలు మాత్రమే తీసుకున్నారట.
ఇంద్రజ:
హీరోయిన్ గా క్రేజ్ ఉన్న ఇంద్రజ.. ప్రస్తుతం జబర్దస్త్ లో జడ్జిగా కొనసాగుతోంది. ఇంద్రజ ఒక్కో ఎపిసోడ్ కు రూ. 2.50లక్షలు పారితోషకంగా తీసుకుంటుందని సమాచారం.
కృష్ణ భగవాన్:
టాలీవుడ్ కమెడియన్ గా కృష్ణ భగవాన్ కి మంచి గుర్తింపు ఉంది. ఇటీవలే జబర్దస్త్ కి జడ్జిగా వచ్చిన భగవాన్ కి ప్రస్తుతం ఎపిసోడ్ కు రూ. 2.50 లక్షల పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. మరి ఈ జబర్దస్త్ జడ్జిల పారితోషికాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.