‘అవును మీరు చూసింది నిజమే. ‘జబర్దస్త్’లో కనిపించను. సినిమాలు కూడా ఏం చేయను.. ఇక పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటాను అన్న రోజా.. మళ్లీ షోలో సందడి చేసింది. జడ్జిగా పంచులు వేసింది. అందరితో కలిసి హాయిగా నవ్వింది, నవ్వించింది. ప్రస్తుతం ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘జబర్దస్త్’ స్టేజీపై మళ్లీ రోజా కనిపించడంతో షో ఫ్యాన్స్.. మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోయారు. ఇకపోతే ఇదే షోలో రోజాను సన్మానించారు. ఆ తర్వాత ఆమె చెప్పిన మాటలు మరోసారి వైరల్ అయ్యాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ కామెడీ షో ఏళ్లకు ఏళ్లు టెలికాస్ట్ కావడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ దాన్ని రియాలిటీలో ప్రూవ్ చేసి చూపించింది ‘జబర్దస్త్’ కామెడీ షో. అప్పుడెప్పుడో 2013 ఫిబ్రవరిలో మొదలైన ఈ షో.. స్టిల్ ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. తాజాగా 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అందుకు సంబంధించిన షూటింగ్ అయిపోయింది. ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఒకప్పటి జడ్జి రోజా మళ్లీ షోలో సందడి చేశారు. కృష్ణభగవాన్, ఇంద్రజలతో కలిసి జడ్జిగా తెగ ఎంటర్ టైన్ చేశారు.
ఇక రోజా వచ్చిదంటే కాస్త హడావుడి ఉంటుంది. ఈ ఎపిసోడ్ లోనూ అది ఉన్నట్లే కనిపిస్తుంది. స్కిట్స్ లో భాగంగా టీమ్ లీడర్స్ పై రోజా పంచులు వేస్తూ కనిపించారు. మధ్య మధ్యలో కృష్ణభగవాన్ కూడ తన మార్క్ పంచులతో తెగ నవ్వించారు. ఇక ఇదే షోలో స్టార్టింగ్ నుంచి చేస్తున్న రాకెట్ రాఘవని అందరూ కలిసి సన్మానించారు. ఆ తర్వాత రోజాను కూడా ఘనంగా సన్మానించారు. ‘నాతో పాటు వచ్చిన హీరోయిన్స్ చాలామందిని ప్రేక్షకులు మరిచిపోయారు. నేను ఇప్పటి జనరేషన్ కి ఇంకా గుర్తున్నాను అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ జబర్దస్త్’ అని రోజా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. మరి ‘జబర్దస్త్’లో రోజా మళ్లీ కనిపించడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.