ఎప్పుడు పంచులతో నవ్వించే జబర్దస్త్ భామలు ఈసారి తమ హాట్ డ్యాన్స్ తో చెమటలు పుట్టించారు. హోలీ స్పెషల్ ఈవెంట్ లో యాంకర్ సౌమ్యారావు, వర్ష, భానులు తమదైన అందాలతో, చూపులతో కైపెక్కించారు.
జబర్దస్త్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది నటీ, నటులు పరిచయం అయ్యారు.. అవుతున్నారు కూడా. ఇక పండగలు వస్తున్నాయి అంటే చాలు మల్లెమాల యాజమాన్యం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఈవెంట్స్ తో అభిమానులను అలరిస్తోంటోంది. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ‘గండెజారి గల్లంతైందే’ అనే స్పెషల్ ప్రోగ్రామ్ ను నిర్వాహించారు. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో జబర్దస్త్ భామలు యాంకర్ సౌమ్యారావు, వర్ష, భానులు తమ హాట్ డ్యాన్స్ తో కుర్రకారును ఊర్రూతలూగించారు. కైపెక్కించే చూపులతో వలపు బాణాలు విసిరారు.
హోలీ పండుగ సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు మల్లెమాల యాజమాన్యం. అందులో భాగంగానే ‘గుండెజారి గల్లంతైందే’ అనే ప్రొగ్రామ్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో తమలో ఉన్న హాట్ నెస్ ను బయటపెట్టారు జబర్దస్త్ ముద్దుగుమ్మలు యాంకర్ సౌమ్యారావు, వర్ష, భాను. ఇప్పటికే తమ అందచందాలతో అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు వీరు.
ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమోలో మరోసారి తమ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించారు. ధృవ సినిమాలోని ‘పరేషానురా..పరేషానురా’ పాటకు ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కలిసి డ్యాన్స్ చేశారు. ఈ పాటలో ముగ్గురు ఇరగదీశారు. హాట్ నెస్ తో పాటుగా క్యూట్ లుక్స్ తో కైపెక్కించారు. మత్తెక్కించే చూపులకుతోడు.. తమదైన స్టెప్పులతో అలరించారు. ముగ్గురికి ముగ్గురు ఎక్కడా తగ్గకుండా తమ టాలెంట్ ను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.