సినీ, బుల్లితెర ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతోమంది నటీమణులు తమ ఆవేదనను మీడియా వేధికగా తెలిపారు. గతంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి గొంతు విప్పారు.
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై కొంతకాలంగా నటీమణులు తమ గళం విప్పుతున్న విషయం తెలిసిందే. గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి హీరోయిన్లు మీడియా ముందు మాట్లాడుతున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్ కౌచ్’విపరీతంగా ఉందని ప్రముఖ నటి ‘రతన్ రాజ్‌పుత్’చెప్పింది. గతంలో తను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపులు, ఉద్యోగం చేస్తున్న మహిళలు వాళ్లున్న ఆఫీసుల్లో, పరిసరాల్లో ఎదర్కొంటున్న సమస్య. ఇది మెళ్లగా సినీ ఇండస్ట్రీలోకి కూడా పాకుతుంది. అవకాశాలు ఇస్తామని చెప్పి నటీమణులను వలలో వేసుకోవడం సినీ ఇండస్ట్రీలో జరుగుతుంది. అని తీవ్ర వాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియెట్ చేసుకున్న నటి రతన్ రాజ్‌పుత్ గతంలో తనకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ‘ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆడిషన్ ఉందంటే ముంబయిలోని ‘ఓషివారా సబర్బ్’హోటల్‌కి వెళ్లాను. అక్కడ ఆడిషన్ పుర్తయిన తర్వాత ఓ కో అర్డినేటర్ వచ్చి డైరెక్టర్‌కి మీ పర్ఫామెన్స్ నచ్చిందని.. ఆయన మీతో పర్సనల్ గా మాట్లాడాలని అన్నారు. ఇందుకోసం పై ఫ్లోర్ లో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. నాతో మాట్లాడుతూ కూల్ డ్రింక్ తీసుకువచ్చాడు.. బలవంతంగా తాగమని అన్నాడు’ అని అన్నారు రతన్ రాజ్ పూత్.
‘మరుసటి రోజు కాల్ చేసి మరో ఆడిషన్ ఉంది, మీకు మళ్లీ కాల్ చేస్తాం అని చెప్పారు. దీంతో నేను నా ఫ్రెండ్ ఇంటికి వచ్చేశాం.. అయితే వాళ్లు ఇచ్చిన డ్రింక్ మేము తాగాం.. ఎందుకో అది చాలా తేడాగా అనిపించింది. కొన్ని గంటల తర్వాత మాకు ఫోన్ వచ్చింది. ఓ ప్లేస్ చేప్పి అక్కడికి రమ్మన్నారు. అక్కడికి వెళ్లి చూస్తే చాలా భయంకరంగా ఉంది. రూమ్ లో బట్టలు.. వస్తువులతో చిందరవందరగా ఉంది. అంతేకాదు అక్కడ ఓ అమ్మాయి మద్యం సేవించి నేలపై పడుకొని ఉండటం గమనించాం.. అక్కడ పరిస్థితి చూసి నాకు భయం వేసి వెంటనే అక్కడ నుంచి బయటికి పరుగెత్తుకొని వెళ్లా’ అని చెప్పుకొచ్చింది నటి రతన్ రాజ్‌పూత్.
2009 లో వచ్చిన ‘అగ్లే జనమ్ మోహే బితియా హై కిజో’సీరియల్ తో రతన్ రాజ్‌పూత్ బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మహాభారత్, సంతోషీ మా సీరియల్స్‌తో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యింది. ప్రస్తుతం ఈ అమ్మడు య్యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ బిజీగా గడిపేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది.ఇప్పటికీ ఇలాంటివి బయటపెట్టకపోతే చాలామంది మోసపోయే అవకాశముందని, అందుకే తనకు జరిగిన అనుభవం ఇంకెవరికీ జరగకుడదని దాన్ని రివీల్ చేసినట్లు ఆమె తెలిపింది.