టీవీ సీరియల్స్ లో కనిపించే సీనియర్ యాక్టర్ రామ్ కపూర్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఇటీవల రామ్ కపూర్ కొత్త పోర్స్చే 911 కరెరా ఎస్ స్పోర్ట్స్ బ్లూ కలర్ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ కారు ధర దాదాపు 1.84 కోట్ల రూపాయలు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కార్ల సంస్థ తమ ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. సెంట్రల్ ముంబైలోని రామ్ కపూర్ నివాసానికి కారును పంపించామని,పోర్షే ఫ్యామిలీలోకి అతడిని ఆహ్వానిస్తున్నా మంటూ సంతోషం వ్యక్తం చేసింది. రామ్ కపూర్ ఈ కొత్త పోర్స్చే 911 కరెరా ఎస్ మాత్రమే కాకుండా, గతంలో చాలా లగ్జరీ కార్లను రైడింగ్ బైక్‌లను కూడా హార్లే డేవిడ్సన్, బిఎమ్‌డబ్ల్యూ జిఎస్ ఇండియన్ మోటార్‌సైకిల్ వంటి వాటిని కూడా కొన్నాడతను.
న్యాయ్ సీరియల్‌తో 1997లో హిందీ బుల్లితెరపై అడుగుపెట్టిన రామ్ కపూర్ హీనా, సంఘర్ష్, కవిత వంటి డ్రామాలతో గుర్తింపు దక్కించుకున్నాడు. హిందీ టెలివిజన్ క్వీన్‌గా గుర్తింపు పొందిన ఏక్తా కపూర్ నిర్మించిన ఘర్ ఏక్ మందిర్‌తో అతడి కెరీర్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కసం సే, బడే అచ్చే లగ్‌తే హై సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. తన నటనకు గానూ పలు అవార్డులు కూడా పొందాడు. ఇక ఏజెంట్ వినోద్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హమ్‌షకల్స్, ఉడాన్, థప్పడ్ వంటి సినిమాల్లో రామ్ కపూర్ నటించాడు.
ఇందుకు స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. వర్షాల్లో ముంబై రోడ్ల మీద ఈ కారు సాఫీగా సాగిపోతుందా? మన టీవీ ఆర్టిస్టులకు ఇంత పెద్ద మొత్తం పారితోషికంగా లభించడం నిజంగా పెద్ద విషయమే. అంతా ఏక్తా కపూర్ మహిమ’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.