ప్రముఖ సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార- తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దాదాపు 8 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జులై నెలలో ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లయి దాదాపు 6 నెలలు గడుస్తోంది. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లల్ని సరోగసి ద్వారా వీరు కన్నారు. ఈ సరోగసి ద్వారా పిల్లల్ని కనటంపై వారిపై చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. ఆ ట్రోలింగ్స్ అంతటితో ఆగలేదు. రోజు రోజుకు తీవ్రం అవుతూ వస్తున్నాయి. తాజాగా, నయన తార ప్రైవేట్ పార్ట్స్‌పై, నయన్-విఘ్నేష్‌ల దాంపత్యం గురించి చాలా రకాల కామెంట్లు వస్తున్నాయి.
ట్రోలర్స్ విచక్షణ కోల్పోయి ఈ కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లపై ప్రముఖ బహు భాషా సింగర్ చిన్మయి శ్రీపాద ఘాటుగా స్పందించారు. నయన తార వ్యక్తి గత విషయాలపై కామెంట్లు చేస్తున్న వారిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వరుస స్టోరీలు పెట్టారు. ఒక రకంగా ఆమె తన ఆవేదనను వెల్లగక్కారు. ‘‘ ఈ కామెంట్లు చేస్తున్న మగాళ్లు తల్లి పాలు తాగారా? లేదా? నాకు ఆశ్చర్యంగా ఉంది. వీళ్లకు ఆడ పిల్లలు ఉంటే పరిస్థితి ఏంటి? ఇంట్లో ఉన్న మగవాళ్ల ముందు కూడా దుపట్టా వేసుకోమని ఓ తల్లి తన కూతురికి చెబుతున్న పరిస్థితి ఉంది.
ఈ మగాళ్లు ఇంట్లో ఉన్న ఆడవాళ్లను చూసి కూడా ఇలానే రెచ్చిపోతారా?’’ అని అన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నయనతారపై కామెంట్లు చేసిన వారి స్క్రీన్ షాట్లను కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల తాలూకూ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు ఆ ట్రోలర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్లను కూడా ఇలానే అంటారా? అంటూ మండిపడుతున్నారు. మరి, నయన తార- తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల వ్యక్తిగత జీవితంపై ట్రోలర్స్ చేసిన అసభ్య కామెంట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.