నందమూరి నటసింహం బాలయ్య – డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అఖండ. మాస్ హీరో మాస్ డైరెక్టర్ కలిస్తే దాని అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపించింది ఈ మాస్ కాంబో. సింహ – లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రమిది. మాస్ జాతర అనే నినాదంతో అటు సోషల్ మీడియాలో ఇటు థియేటర్స్ వద్ద అఖండ నిజమైన పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. మార్నింగ్ షో నుండే అఖండ మాసివ్ టాక్ తో మాసివ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. సినిమా ఎలాగైతే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిందో ఆ అంచనాలను బీట్ చేసిందని పబ్లిక్ రెస్పాన్స్ చూస్తేనే అర్ధమవుతుంది.
అయితే లాక్ డౌన్ తర్వాత ఈ ఏడాది రిలీజైన బిగ్గెస్ట్ మూవీ కావడంతో అఖండ సినిమా పాజిటివ్ మాస్ టాక్ తో ఇండస్ట్రీకి శుభారంభం ఇచ్చిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో అఖండ సినిమా విజయాన్ని అభినందిస్తూ టాలీవుడ్ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్ వేదికగా సూపర్ స్టార్ మహేష్ బాబు అఖండ విజయం పై స్పందిస్తూ.. ఇండస్ట్రీకి అఖండ శుభారంభాన్ని ఇచ్చిందని బాలయ్య – బోయపాటిలకు కంగ్రాట్స్ తెలిపాడు. అలాగే యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ట్విట్టర్ లో అఖండ సక్సెస్ పై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా హీరో నానితో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు బాలయ్య పై వారి అభిమానాన్ని పోస్ట్స్ ద్వారా తెలుపుతున్నారు.
Hearing great stuff about #Akhanda 🔥…Congratulations to Balakrishna garu..Boyapati Sreenu Garu, @dwarakacreation , @MusicThaman @ItsMePragya n the rest of the team!
Telugu Cinema Wave has begun! ❤️
Love..#RAPO
— RAm POthineni (@ramsayz) December 2, 2021
ఈ చిత్రంలో బాలయ్య ధరించిన అఘోర వేషానికి అభిమానులు పూనకాలు కలిగే రేంజిలో కనెక్ట్ అవ్వడం విశేషం. మొత్తానికి బాలయ్యకు డైరెక్టర్ బోయపాటి మరో మాసివ్ హిట్ అందించినట్లే. మరి బిబి3 కాంబో మాస్ జాతర థియేటర్లలో ఇలాగే కొనసాగుతుందేమో చూడాలి. ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Extremely happy to hear that #Akhanda has had a massive start! 👏👏 Congratulations to #NandamuriBalakrishna garu, #BoyapatiSreenu garu and the entire team! @ItsMePragya @MusicThaman @dwarakacreation
— Mahesh Babu (@urstrulyMahesh) December 2, 2021
అఖండ తో బోయపాటి – బాలయ్య మళ్ళీ అదరగొట్టారు.. యాక్షన్ అద్భుతంగా ఉంది. బోయపాటి తనదైన మార్క్ లో ఫైట్స్ ని చిత్రీకరించారు…. బాలయ్య బాబు నటన, పాత్రలోకి ఒదిగిన విధానం చాలా బాగుంది… థియేటర్స్ లో మాస్ జాతర మొదలైంది… #Akhanda
— Raghavendra Rao K (@Ragavendraraoba) December 2, 2021