ఈ మధ్యకాలంలో చాలా మంది సినిమా హీరో, హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు. ఇప్పటికి ఎంతోమంది సెలబ్రెటీల తమ చిన్ననాటి ఫోటోలో సోషల్ మీడియాలో చేరి వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ గా పేరుగాంచిన ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోలు ఆ హీరోయిన్ చిన్నప్పుడు ముద్దుగా కనిపిస్తూ ఉంది. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్న ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతోంది.
మన గడిచిన జీవితంలో ప్రతీ ఒక్కరికీ చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. ముఖ్యంగా అవి ఫోటోల రూపంలో ఇప్పటికీ భద్రంగానే ఉంటుంటాయి. అప్పటి చిన్ననాటి ఫోటోలను ఇప్పుడు పెద్దయ్యాకా చూస్తే మనం ఎంతో సంతోష పడుతుంటాం. అలాగే ఇప్పడు హీరోయిన్ లు గా దూసుకుపోతున్న వారి చిన్ననాటి ఫోటోలను చూస్తే.. అసలు వీళ్లేనా అని అనిపిస్తుంది. ఇకపోతే పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని చూశారు కాదా.. ఎంతో ముద్దుగా కనిపిస్తుంది కదూ. ఆమె ఇప్పుడు ఎవరో కాదు, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. అవును మీరు విన్నది నిజమే.
ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఎవరో ఇంకా గుర్తు పట్టలేదా? ఆమె ఎవరో కాదండోయ్.., అర్జున్ రెడ్డి మూవీ హీరోయిన్ శాలినీ పాండే. ఈ మూవీతోనే తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118 మూవీ, 100 % కాదల్ వంటి సినిమాల్లో నటించింది. ఇవి చిత్రాల్లోనే కాకుండా ఈ సుందరి ఇంకా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బామ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ వరుస ఆఫర్లను వడిసిపట్టుకుంటూ హిందీలో కొన్ని సినిమాల్లో నటిస్తుంది.