ప్రతి ఏడాది సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇండస్ట్రీలో కొత్త సినిమాల సందడి మొదలైపోతుంది. స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు.. సమ్మర్ సీజన్ వచ్చేసరికి సినిమాలన్నీ రిలీజ్ కి రెడీ చేస్తుంటారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ అంటే.. పెద్ద హీరోల సినిమాలే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్.
ప్రతి ఏడాది సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇండస్ట్రీలో కొత్త సినిమాల సందడి మొదలైపోతుంది. స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు.. సమ్మర్ సీజన్ వచ్చేసరికి సినిమాలన్నీ రిలీజ్ కి రెడీ చేస్తుంటారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ అంటే.. పెద్ద హీరోల సినిమాలే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్. అందులో కొన్ని చిన్న సినిమాలు వస్తుంటాయి. కానీ.. ఈ ఏడాది సమ్మర్ ని ఎంజాయ్ చేసేందుకు సినీ ప్రియులు సిద్ధంగా లేరేమో అనిపిస్తోందట. ఎందుకంటే.. జనవరిలో చిరు, బాలయ్య, విజయ్ లాంటి స్టార్స్ సినిమాలు సందడి చేశాయి. ఫిబ్రవరిలో ధనుష్, కిరణ్ అబ్బవరం, సుహాస్ సినిమాలు అలరించాయి.
మార్చి విషయానికి వస్తే.. టాలీవుడ్ లో ఎక్కువగా వాయిదాలే కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు సినిమాలను థియేటర్స్ లో చూసే మూడ్ లో ఉన్నారో లేదో తెలియదు. అలాగని చూస్తారని అనుకోని రిలీజ్ చేశాక వాళ్ళు రాకపోతే దెబ్బపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కరోనా ప్రభావం లేదు.. ఎప్పటిలాగే మార్చిలో పరీక్షలు కూడా ముగియనున్నాయి. అయినా.. ప్రేక్షకులలో కొత్త సినిమాల కోసం ఆరాటం కనిపించట్లేదు.. మరోవైపు హీరోల నుండి రిలీజ్ డేట్స్ కాకుండా వాయిదా పడుతున్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పైగా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో ఒక్క పేరున్న సినిమా కూడా రిలీజ్ కాకపోవడం గమనార్హం.
ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఎలాంటి ఊపు కనిపించకపోవడంతో ఒక్కో సినిమా వాయిదా పడుతూ వస్తున్నాయి. మార్చి 3న రిలీజ్ కావాల్సిన కార్తికేయ ‘బెదురులంక 2012’ వాయిదా పడింది. అంతకుముందే ధమ్కీ(మార్చికి), శాకుంతలం సినిమాలు ఏప్రిల్ కి వాయిదా పడిపోయాయి. ఇప్పుడీ పోస్ట్ పోన్ అవుతున్న సినిమాల లిస్ట్ లోకి మరో కొత్త సినిమా చేరింది. అదే బెల్లంకొండ గణేష్ నటిస్తున్న ‘నేను స్టూడెంట్ సార్’. స్వాతిముత్యంతో మొదటి హిట్ అందుకున్న గణేష్.. రెండో ప్రయత్నంగా ఈ సినిమాని మార్చి 10న రిలీజ్ షెడ్యూల్ చేసుకున్నాడు. ఎందుకోగానీ.. ఇప్పుడీ స్టూడెంట్ మూవీ కూడా వాయిదా పడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వీరమల్లు, మహేష్ బాబు ‘SSMB28’ సినిమాలు కూడా ముందుగా సమ్మర్ రిలీజ్ అనౌన్స్ చేసినప్పటికీ.. ఇప్పుడు 2023 సెకండాఫ్ లో రిలీజ్ కాబోతున్నాయి.
సో.. ఆల్రెడీ డేట్స్ షెడ్యూల్ చేసుకున్న సినిమాలే రిలీజ్ కి వెనుకాముందు అవుతున్నాయి. మార్చిలో కూడా టాలీవుడ్ నుండి పెద్ద సినిమాలు లేవు. ఒక్క నాని ‘దసరా’ తప్ప.. మిగతా సినిమాలు సగం జనాలకు తెలియదు. దసరా కూడా మార్చి లాస్ట్ వీక్ లో.. 30న రిలీజ్ కాబోతుంది. ఎలాగో పెద్ద సినిమాలు లేవు.. ఏప్రిల్ లో మాత్రం చాలా సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ఇక వాటిలో ఉండేవి.. ఏవో వాయిదా పడేవి ఏవో మున్ముందు తెలియనుంది. ఇదిలా ఉండగా.. మార్చిలో ఒకే ఒక్క డబ్బింగ్ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన ‘కబ్జా’.. మార్చి 17న రిలీజ్ అవుతోంది. చూడాలి.. ఈసారి ఉపేంద్ర కన్నడ ఇండస్ట్రీకి ఎలాంటి హిట్ ఇస్తాడో! మరి సమ్మర్ లో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.