తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య. ‘జోష్’ చిత్రంతో కెరీర్ ఆరంభించిన నాగ చైతన్యకు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పెద్ద హిట్ లేకున్నా.. హీరోగా తన కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నాడు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరి’ ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది.. ఈ సందర్బంగా హీరో నాగచైతన్య ఇంటర్వ్యూ పలు విషయాలు వెల్లడించారు.
శేఖర్ కమ్ములతో వర్క్ చేయడం విషయం గురించి మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల చిత్రాలు మొదటి నుంచి గమనిస్తున్నానని.. ఆయనతో పనిచేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని.. రియలిస్టిక్ చిత్రాలంటే నాకు ఎంతో ఇష్టమని.. మజిలీ సినిమాలో ఈ సంతృప్తి కొంత దొరికిందని.. లవ్ స్టోరితో నెక్ట్ లెవెల్ హ్యాపీనెస్ పొందానని అన్నారు. ఈ చిత్రంలోని మెయిన్ పాయింట్ గురించి చెబుతూ.. లవ్ స్టోరి సినిమాలో మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ ఇష్యూను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరపై చూపించబోతున్నారు. జెండర్ బయాస్, కాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది. పల్లవి అనే క్యారెక్టర్ ద్వారా ఈ విషయాన్ని కొన్ని చూపిస్తున్నామన్నారు. ఈ సినిమా ద్వారా మీరు ఏం నేర్చుకున్నారన్న విషయం గురించి మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల గారు చాలా కంఫర్ట్ ఇచ్చి సినిమా చేయించారు. ఆయనతో పనిచేసిన తర్వాత ఒక నటుడిగా, పర్సన్ గా ఎదిగాను… ఆయనతో జర్నీ చేస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకే ఆయనతో ఎక్కడిదాకా అయినా ట్రావెల్ చేస్తాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను అన్నారు.
ఈ సినిమలో తెలంగాణ యాస మాట్లాడినట్టు తెలిసిందన్న ప్రశ్నకు.. సమాధానంగా ఈ సినిమాలో అచ్చమైన తెలంగాణ అబ్బాయిని.. అందుకే నేను తెలంగాణ యాసలో మాట్లాడుతాను.. అయితే ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాము. ఇక డబ్బింగ్ సమయంలో లాక్ డౌన్ రావడంతో ప్రాక్టీస్ మరింత పెరిగి చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. సాయి పల్లవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం విషయం గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ చిత్రం ద్వారా ఇద్దరికీ మంచి పేరొస్తుంది. సాయి పల్లవి మంచి డ్యాన్సర్, యాక్టర్.. ఆమెతో నటించడం చాలా ఎంజాయ్ అనిపించింది. డ్యాన్సుల పరంగా ఏదైనా ఇబ్బంది పడ్డారా అన్న విషయం గురించి చెబుతూ.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో మంచి బౌండింగ్ ఏర్పడింది.. దాంతో లవ్ స్టోరిలోనూ మంచి స్టెప్పులు చేయించారు. పాటలన్నీ చాలా సిచ్యువేషనల్ ఉంటూ.. డ్యాన్స్ కూడా వాటికి తగ్గట్టుగానే సహజంగా కంపోజ్ చేశారని అన్నారు. సాయి పల్లవి డ్యాన్స్ పరంగా మంచి హెల్ప్ చేశారని అన్నారు.
డైరెక్టర్ సుకుమార్ తో మరో సినిమా ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆయనతో చేయాలని ఉందని.. ఇటీవలే ఓ సందర్భంలో నేచురల్ అప్రోచ్ ఉన్న సినిమాలకే ఎక్కువ ఆదరణ దక్కుతోందనే విషయం మీద మాట్లాడుకున్నాం అని అన్నారు. ఇక రంగస్థలం నుంచి ఇదే ఫార్మేట్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. బాలీవుడ్ ఎంట్రీ పై మాట్లాడుతూ.. అమీర్ ఖాన్ గారితో కలిసి చేస్తున్నానని.. మంచి కథ ఉంటే ఇతర భాషా చిత్రాల్లో నటించేందుకు సిద్దమని అన్నారు. అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక నెక్స్ట్ మూవీస్ ఏంటి అన్న ప్రశ్నకు సమాధానంగా.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ ఫిల్మ్ చేస్తున్నాను.. అది ఇంకా ఒక టెన్ డేస్ వర్క్ ఉంది. దిల్ రాజు గారు ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇంకా బంగార్రాజులో నాన్న గారితో పాటు ఒక ముఖ్యమైన పాత్ర ఒకటి చేస్తున్నాను.. కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. విక్రమ్ కుమార్ తో ఒక వెబ్ సిరీస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.