‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పుచేయలేదని.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్‌పై తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వాటిపై వివరణ ఇచ్చారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. తాను ఏ తప్పు చేయలేదని.. క్షమాపణ చెప్పనన్నారు. చిన్న సినిమాలపై తాను మూడు గంటల సేపు మాట్లాడితే.. కేవలం ఓ క్లిప్పింగ్ ఆధారంగా తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజమౌళిని చూసి తాను జెలసీ ఫీలవుతున్నానని కొందరు అంటున్నారని.. ఆయన తనకు సమకాలీకుడు కాదంటూ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏదో కృష్ణా, రామా అంటూ బతుకుతున్నానని చెప్పారు. రెండ్రోజుల కింద ‘ఆర్ఆర్ఆర్’ను ప్రశంసిస్తూ మాట్లాడానని.. దాని గురించి ఎవరూ పట్టించుకోరన్నారు.
‘సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ విషయంపై తమ్మారెడ్డి ఎవరనేది తెగ వైరల్ అవుతోంది. బయటివాళ్లు నా మీద కామెంట్స్ చేస్తే పట్టించుకోను. కానీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లు ఇలా అనడం సరికాదు. అసలు వీడికేం లెక్కలు తెలుసంటున్నారు కొందరు. నాకు లెక్కలు తెలియనక్కర్లేదు. అయితే చాలా మంది అకౌంట్స్ నాకు తెలుసు. ఎవరెవరు ఏ అవార్డులు, పదవుల కోసం ఎవరెవరిని ఏమేం అడుక్కున్నారో, ఎవరెవరి కాళ్లు పట్టారో అన్నీ నాకు తెలుసు. నేనెప్పుడూ వీటి గురించి మాట్లాడను. నేను మాట్లాడితే ఇండస్ట్రీ పరువు పోతుంది. ఇండస్ట్రీ నా తల్లి. ఇండస్ట్రీని గౌరవిస్తా. అందుకే ఈరోజుకీ సంయమనంగానే మాట్లాడుతున్నా’’ అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
‘నీయమ్మ మొగుడని ఒకరు నన్ను అన్నారు. నా అమ్మ మొగుడు నాకు సంస్కారం నేర్పించాడు. నాకు నీతిగా బతకడం, నిజం చెప్పడం నేర్పించాడు. మీకు నేర్పించారా? మీకు నిజం తెలుసా? నిజం చెప్పగలరా మీరు? మీరు చేసిన నిజాలేంటో చెప్తారా? మీకు హక్కుందా నా గురించి మాట్లాడటానికి?’ అని తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. తనను తిట్టిన వారికి సిగ్గుండాలని ఆయన అన్నారు. ఆకాశాన్ని చూసి ఉమ్మేస్తే తిరిగి మొహం మీదే పడుతుందంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. మరి.. తమ్మారెడ్డి ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.