సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్ల కిందట హీరోయిన్లపై, లేడీ ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు జరిగాయంటూ మీటూ అనే వివాదం ఒకటి చర్చల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఎందరో హీరోయిన్స్, ఆర్టిస్టులు బయటికి వచ్చి, వారికి జరిగిన అన్యాయాలను గురించి మీడియా ముఖంగా బహిర్గతం చేశారు.. చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా.. తనకు ఏదైనా జరిగితే దానికి కారణం నానా పటేకర్, అతని లీగల్ టీమ్, బాలీవుడ్ మాఫియానే అంటూ చెప్పి మరోసారి వివాదాన్ని తెరలేపింది.
2008లో విడుదలైన ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా కోసం ఓ పాట షూటింగ్ టైంలో నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ ఆరోపించింది. ఆమె ఆరోపణలను నానా పటేకర్ ఇదివరకే ఖండించారు. ఇక తనుశ్రీ ఇటీవల సోషల్ మీడియా పోస్టులో.. “నాకు ఏదైనా జరిగితే #metoo నిందితుడు నానా పటేకర్, అతని లాయర్లు, సహచరులు, అతని వెనకున్న బాలీవుడ్ మాఫియా ఫ్రెండ్స్ బాధ్యులని చెప్పండి! బాలీవుడ్ మాఫియా ఎవరంటే.. సుశాంత్ సింగ్ మరణ కేసులో తరచుగా వినిపించిన పేరు ఆ క్రిమినల్ లాయర్ దే.
ఇకపై వారి సినిమాలను చూడకండి. నా గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేసిన ఫేమస్ ముఖాలు, జర్నలిస్టుల వెంటపడండి. ఇలాంటి దుష్ప్రచారాల వెనుక వారి PR లు కూడా ఉన్నారు. ఎవరిని వదలకండి! నన్ను చాలా వేధించినందుకు వారి జీవితాలను నరకయాతన చేయాలని, చట్టం, న్యాయం నాకు లభించకపోవచ్చు. కానీ.. దేశప్రజలపై తనకు నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తనుశ్రీ మాటలు నెట్టింట, సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. మరి తనుశ్రీ ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.