పోసాని కృష్ణ మురళి నంది అవార్ట్స్ పై ఘాటైన కామెంట్స్ చేశాడు. అవి నంది అవార్డ్స్ కావు కమ్మ అవార్ట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. నంది అవార్డ్స్ ఇప్పించే శక్తి ఉంటే ఇప్పించాలని సవాల్ విసిరారు.
సాధారణంగా ఇండస్ట్రీలో కొంత మంది నటులు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతుంటాయి. తాజాగ అలాంటి దుమారాన్నే లేపారు నటుడు, దర్శక, నిర్మాత పోసాని కృష్ణ మురళి. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న పోసాని నంది అవార్ట్స్ పై ఘాటైన కామెంట్స్ చేశాడు. అవి నంది అవార్డ్స్ కావు కమ్మ అవార్ట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నంది అవార్డ్స్ జ్యూరీలో ఎక్కువ మంది కమ్మ కులానికి చెందిన వారే ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించాడు సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. నంది అవార్డ్స్ ఇప్పించే శక్తి ఉంటే ఇప్పించాలని సవాల్ విసిరారు.
పోసాని కృష్ణ మురళి.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. నంది అవార్డ్స్ కమ్మ అవార్డ్స్ అని, అందుకే తనకు టెంపర్ సినిమాకి గాను నంది అవార్డ్ వచ్చినా తీసుకోలేదు అంటూ తాజాగా వ్యాఖ్యానించారు పోసాని. పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రాజేశాయి. నంది అవార్డ్స్ జ్యూరీలో ఉన్న సభ్యుల్లో ఎక్కువ మంది కమ్మ కులానికి చెందిన వారే ఉన్నారు అంటూ.. అందుకే నాకు వచ్చిన అవార్డ్ ను తిరస్కరించానని చెప్పుకొచ్చారు పోసాని. ఇక తాజాగా పోసాని వ్యాఖ్యలపై స్పందించారు ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..
”అసలు అవార్డ్స్ ఇవ్వట్లేనప్పుడు వాటి గురించి మాట్లాడుకోవడం ఏంటి? అదీకాక అవార్డ్స్ లోకి కులాలు తీసుకురావడం కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు కూడా ఈ నంది అవార్డ్స్ గురించి పట్టించుకోట్లేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇవ్వలేదు.. రాష్ట్రాలు విడిపోయాక కూడా ప్రభుత్వాలు ఈ అవార్డ్స్ పై దృష్టిపెట్టలేదు. పోసానికి శక్తి ఉంటే జగన్ ప్రభుత్వం చేత నంది అవార్డ్స్ ను ఇప్పించాలి” అంటూ చెప్పుకొచ్చారు. మేం జ్యూరీ మెంబర్స్ గా ఉంటే న్యాయబద్దంగా నంది అవార్డ్స్ ఇచ్చే వాళ్లం అని పోసాని ఆలోచన అన్నట్లుగా తనకు అనిపించింది అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు. అసలు ప్రభుత్వాలు మన ఇండస్ట్రీని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కమ్మ అవార్డ్స్ అనడంపై స్పందిస్తూ.. అవార్డ్స్ లోకి కులాల ప్రస్తావన తేవడం చాలా తప్పు, ఇది కరెక్ట్ కాదు అంటూ వివరించాడు. మరి పోసాని వ్యాఖ్యలపై తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ పై అభిప్రాయాలను తెలియజేయండి.