Tammareddy Bharadwaj: తెలుగు వెండి తెర రారాజు కృష్ణంరాజు ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సోమవారం ఆయన ఫామ్ హౌస్‌లో అంత్యక్రియలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు మృతికి సంతాపం తెలియజేస్తూ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, మంచు మనోజ్, సీ కల్యాణ్, కరాటే కల్యాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘ నిర్మాతగా నా ఫస్ట్ సినిమా హీరో కృష్ణంరాజు గారు. ఆ సినిమాకు మా అన్నయ్యే దర్శకుడు.
సినిమాలో నాలుగు సాంగ్స్ ఉండాలని మా అన్నయ్య పట్టుబట్టాడు. ‘కృష్ణంరాజు సినిమాలో నాలుగు సాంగ్స్ ఏంట్రా? ఎవరు చూస్తారు?’ అన్నాను. మా అన్న వినలేదు. నేను కృష్ణం రాజు గారి దగ్గరకు వెళ్లాను. ‘బాబాయ్ నీ మీద పాటలు తీస్తానంటున్నాడు మా అన్నయ్య. ఎవడు చూస్తాడు ఈ సినిమా?’ అన్నాను. వేరే హీరో అయితే, లాగిపెట్టి కొట్టేవారు. కానీ, ఆయన అలా చేయలేదు. ఓ నవ్వు నవ్వి ‘నేను పనికి రానా?’ అన్నారు. తర్వాత మా అన్నను ఒప్పించారు. నేను చెప్పినట్టు సినిమా జరిగింది. ఆయన మనసులో ఏమీ ఉండదు. సినిమాకు ఏం కావాలో చేస్తారు. మాకు ఆయన మూడు సినిమాలు చేశారు.
నాలుగు, ఐదు సంవత్సరాలు ఆయన ఫోన్ ఎత్తడానికి భయపడే పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి మాట్లాడటానికి కూడా సిగ్గేసే పరిస్థితిలో ఉన్నా. మూడేళ్ల క్రితం ఆయన నా దగ్గరకు వచ్చి మూవీ టవర్స్‌లో ఫ్లాట్స్ కావాలి అని అడిగారు. మార్కెట్ రేట్ ఇవ్వాలని చెప్పా. ‘ఎంతుంటే అంత. తీసుకుంటాను’ అన్నారు. కానీ, ఆయనకు ఫ్లాట్ ఇవ్వలేకపోయాం. ఇప్పుడు సిగ్గుపడుతా ఉన్నా’’ అని అన్నారు. మరి, కృష్ణంరాజుపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Rashmika: డాన్స్ తో మనసు దోచుకున్న చిన్నారి! ఎలాగైనా ఆ పాపను కలవాలంటూ రష్మిక ట్వీట్!