సురేఖా వాణి.. టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు కాస్త సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటూ ఉంటారు. ఆమె కుమార్తె సుప్రితకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచు లక్ష్మితో కలిసి లేచింది మహిళా లోకం సినిమా కూడా చేస్తోంది. ఇటీవలే సుప్రిత బర్త్ డే సెలబ్రేషన్స్ సోషల్ మీడియా అంతా వైరల్ అవ్వడం చూశాం.
తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా సురేఖా వాణి, సుప్రితలను ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో వారికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు వేశాడు. అందుకు వాళ్లు ఎంతో సరదాగా సమాధానాలు చెప్పారు. కొన్ని సీరియస్ ఇష్యూస్ ని కూడా నిఖిల్ తనదైనశైలిలో సమాధానాలు రాబట్టాడు. ఇప్పుడు నిఖిల్ సింహా అడిగిన ఓ ప్రశ్న నెట్టింట వైరల్ గా మారింది.
‘త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు?’ అంటూ నిఖిల్ ప్రశ్నించాడు. అందుకు సురేఖా వాణి నో అనే బోర్డు చూపించగా.. సుప్రీత మాత్రం ఎస్ అనే బోర్డు చూపించింది. అంతేకాకుండా చేసేద్దాం సింగిల్ గా ఎలా ఉంటుంది. అలా ఉన్నప్పటి నుంచి నా బుర్ర తింటూ ఉంటుంది అంటూ కామెంట్ చేసింది. సురేఖా వాణి మాత్రం అలాంటి ఉద్దేశం లేదంటూ చెప్పింది. అంతేకాకుండా బాయ్ ఫ్రెండ్ విషయంలో నిఖిల్ మరో ప్రశ్న అడిగాడు.
‘మీరిద్దరూ సింగిలేనా?’ అంటూ తల్లీకుమార్తెలను ప్రశ్నించగా.. ఇద్దరూ అవునని చెప్పారు. ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలని కోరగా.. నన్ను భరిస్తే చాలంటూ సుప్రిత సమాధానం చెబుతుంది. సురేఖా మాత్రం తనకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ రివీల్ చేసింది. 6 ఫీట్ హైట్ ఉండాలి, మంచి కలర్, బాగా డబ్బు ఉండాలి, బాగా చూసుకోవాలి, లైట్ గా గడ్డం ఉంటాలి అంటూ చెప్పుకొస్తుంది.
అందుకు సుప్రిత కెమెరా చూస్తూ మరి మీకు ఇవ్వన్నీ లేవుగా సార్ అంటూ కామెంట్ చేస్తుంది. అంటే సురేఖా వాణికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేక ఎవరైనా వన్ సైడ్ ట్రై చేస్తున్నారా అనుమానాలు వచ్చేలా సుప్రిత రియాక్షన్ ఉంది. నిఖిల్ కూడా ఎవరైనా ఉన్నారా అని అడగ్గా లేరంటూ సురేఖా సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతున్న ఈ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.