సూపర్‌స్టార్ ‘మహేశ్‌బాబు’ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీతో బిజీగా ఉన్నారు. తాజాగా మహేశ్‌బాబు రాబోయే చిత్రంపై పుకార్లు సినీ వీధుల్లో షికార్లు చేస్తున్నాయి. కేజీఎఫ్‌తో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్‌తో మహేశ్ తర్వాతి ప్రాజెక్టు ఉండబోతోందని బాగా వినిపిస్తోంది.
ప్రశాంత్ నీల్ డీవీవీ బ్యానర్‌లో సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. డీవీవీ బ్యానర్ వాళ్ల దగ్గర మహేశ్ బాబు డేట్స్ ఉండటంతో ఈ వార్త ఇంకాస్త గట్టిగా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘యష్’ కేజీఎఫ్ ఛాప్టర్ 2, ‘ప్రభాస్’ ‘సలార్’ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అన్ని సక్రమంగా జరిగితే.. మహేశ్ బాబు, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో చూసే అవకాశాలు లేకపోలేదు. ఏమో కేజీఎఫ్ ఛాప్టర్-2 రిలీజ్ అయితే ప్రశాంత్ నీల్‌కు ఇంకా పెద్దపెద్ద ఆఫర్లు కూడా రావచ్చేమో. ఆ విషయాలపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.