ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ మూవీ పుష్ప. రీజనల్ మూవీగా మొదలై పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లను రాబట్టుకుంది. దక్షిణాది భాషలను పక్కన పెడితే ముఖ్యంగా పుష్ప హిందీ వెర్షన్ 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించింది. మరోవైపు పుష్ప పాటలతో, డైలాగ్స్ తో సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు ఓ రేంజిలో వైరల్ అవుతున్నాయి.
లోకల్ నుండి ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకు పుష్ప ఫీవర్ వ్యాపించింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సినీ వర్గాలలో పుష్ప సినిమాలో అవకాశం వచ్చి వదులుకున్న స్టార్స్ గురించి కథనాలు వెలువడుతున్నాయి. పుష్పలో ఇదివరకు చూడని ముఖాలు కూడా జనాలను ఆకట్టుకుని ఫేమ్ పొందాయి. మరి సోషల్ మీడియా కథనాల ప్రకారం.. పాన్ ఇండియా పుష్పలో ఛాన్స్ ,మిస్ చేసుకున్న స్టార్స్ ఎవరో చూద్దాం!డైరెక్టర్ సుకుమార్ పుష్ప స్క్రిప్ట్ మొదటగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించాడట. అయితే.. పుష్పరాజ్ మేనరిజం, బాడీ లాంగ్వేజ్ తనకు సెట్ కావని మహేష్ వదులుకున్నాడట. ఇక హీరోయిన్ శ్రీవల్లి పాత్రకు మొదటగా సమంతను అడిగారట.. పలు కారణాలతో ఆమె కూడా వదులుకుందట. పుష్ప స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ బాలీవుడ్ దిశాపటాని, నోరా ఫతేహిలను సంప్రదించారట. కానీ చివర్లో సమంత వచ్చింది.
పుష్పలో హీరో హీరోయిన్ల పాత్రల తర్వాత అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ పోలీస్ భన్వర్ సింగ్ షెకావత్. ఈ పాత్ర కోసం సుకుమార్ మొదటగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని అడగటం జరిగిందట. కానీ డేట్స్ కుదరక ఈ సినిమాను విజయ్ సేతుపతి మిస్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ ఐదుగురి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. మరి పుష్ప సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.