బాలీవుడ్ ఈ మద్య ప్రేమ జంటలు ఒక్కొక్కరూ పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. కొందరు మధ్యలోనే బ్రేకప్ చెబుతుంటే మరి కొందరు మాత్రం ఊహించిన విధంగా ఎవరికి తెలియకుండానే పెళ్లి ఫోటోలతో దర్శనమిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని జంటలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక త్వరలోనే మరొక బాలీవుడ్ జంట ఏడడుగులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా మంచి పేరు సంపాదించాడు నటుడు విద్యుత్ జమాల్. వెండితెరపై వైవిధ్యభరితమైన రోల్స్ చేస్తూ ఛాలెంజింగ్ స్టంట్స్‌తో ప్రేక్షాదరణ పొందారు విద్యుత్ జమ్వాల్. ఓ వైపు విలన్ గా నటిస్తూనే.. మరోవైపు హీరోగా పలు చిత్రాల్లో తన సత్తా చాటుతున్నాడు. గత కొంతకాలంగా విద్యుత్ జమాల్ ఒక ఫ్యాషన్ డిజైనర్ తో పీకల్లోతుల్లో ప్రేమలో మునిగితేలుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీ. వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం నడిపిస్తూ డేటింగ్ చేసి 2021 లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు బీ టౌన్ లో వార్తలు వినిపించాయి.
ఈ జంట లండన్ లో ఓ వెకేషన్ టూర్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక్కడే పెళ్లి కూడా చేసుకోబోతున్నారట.. మరో వైపు అల్ రెడీ ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు త్వరలో విద్యుత్ జమాల్ చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజులు జమాల్ తమ పెళ్లి విషయంపై ఒక ప్రకటన ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తమ కుటుంబ సభ్యులు, దగ్గరి స్నేహితుల సమక్షంలో నిందితను పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.
విద్యుత్ జమాల్ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. సూర్య నటించిన సికిందర్ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ కీలక పాత్ర పోషించాడు. ఊసరవెల్లి, తుపాకీ మూవీలో నటించాడు. ప్రస్తుతం బిజీగా ఉన్న విద్యుత్ జమ్వాల్ IB71 అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీతో నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.