సినిమా అంటే కొందరికి పిచ్చి, మరికొందరికి సరదా, ఇంకొంతమందికి వ్యసనం. తెలుగు ప్రేక్షకులు సినిమాల విషయంలో అస్సలు మొహమాటపడరు. భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుంటే చాలు.. గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా తెలుగు మూవీ లవర్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ అందరూ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న సినిమా ‘అవతార్ 2’. డిసెంబరు 16న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం స్టార్ డైరెక్టర్ పనిచేశాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. 2009లో రిలీజైన ‘అవతార్’ సినిమా అంతటా వండర్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అప్పట్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నెక్స్ ప్రాజెక్ట్ ఏంటా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. అందుకు తగ్గట్లే ‘అవతార్’ను ఫ్రాంచైజీగా తీసుకొస్తున్నామని.. ఇందులో భాగంగా 2,3,4,5 పార్ట్స్ కూడా ఉండబోతున్నాయని సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పారు. దీంతో ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు థియేటర్లలోకి వస్తాయా? వాటిని చూసేద్దామా అని తెగ ఎదురుచూశారు. అందుకు తగ్గట్లే రెండో పార్ట్.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత డిసెంబరు 16న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
ఈ క్రమంలోనే ‘అవతార్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ వీకెండ్ కు సంబంధించిన టికెట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఫ్యాన్స్ కూడా రిలీజ్ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే.. ‘అవతార్ 2’ తెలుగు వెర్షన్ కోసం స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ పనిచేశారు. తెలుగు డైలాగ్స్ అన్ని ఆయనే రాశారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా డబ్బింగ్ సినిమాల కోసం హనుమాన్ చౌదరి, వెన్నెలకంటి లాంటి వారు పనిచేస్తుంటారు. కానీ ఓ స్టార్ డైరెక్టర్, డైలాగ్ రైటర్ గా మారడం మాత్రమే ఇదే తొలిసారి! మరి ‘అవతార్ 2’ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.