పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీ లీల.. రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు 28వ చిత్రంలో, అనగనగా ఒకరోజు, బోయపాటి శ్రీను సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అయితే శ్రీలీల ఫ్యాన్స్ కి సలహా ఇస్తుంది. వారానికి లేదా నెలకి ఒకసారైనా సరే ఆ పని చేయాలని చెబుతోంది.
సెలబ్రిటీలు షూటింగ్ ఉన్నంత కాలం కష్టపడతారు. షూటింగ్ అయిపోగానే రిలాక్స్ అయిపోతారు. వెకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం అనాథాశ్రమంలో పిల్లలతో సమయాన్ని గడుపుతుంటారు. ఇప్పటికే శ్రియ, సమంత లాంటి హీరోయిన్లు పలు స్వచ్ఛంద సంస్థలను ప్రారంభించి అనాథ పిల్లలతో కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ కోవలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల కూడా చేరిపోయారు. శ్రీలీల హియర్ ఫర్ యు పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. కుదిరినప్పుడల్లా ఓ అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడి పిల్లలతో గడిపి రావడం. ఈ క్రమంలోనే శ్రీలీల ఓ అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడ పిల్లలతో చాలా సేపు గడిపింది.
ఇది నా చిన్న సమూహం. పెద్ద కలలతో, పెద్ద పెద్ద మనసులతో చిన్నారులని కలిశానని ఆమె వెల్లడించింది. మీరు వారిని చూసే వరకూ మీకు తెలియదు.. వారు ఎంతో విలువైన వారని. ఒక రోజంతా వారితో గడిపాను. కలల గురించి మాట్లాడుకున్నాం. విపరీతమైన ప్రేమతో కథలు చెప్పుకున్నాం, డ్యాన్సులు చేసాం, పాటలు పాడుకున్నాం. నాకు తెలుసు ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభూతిని పొందాలనుకుంటారని నాకు తెలుసు. వీలయితే వారితో గడపండి. చాలా మంది ప్రజలు ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. కానీ వారికి దిశానిర్దేశం ఉండదు, ఎలా చేయాలో తెలియదు. అది మీ చేతుల్లోనే ఉంది. గూగుల్ లో వెతకండి. మీ సమీపంలో మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల అనాథాశ్రమానికి వెళ్ళండి అంటూ రాసుకొచ్చింది.
మిమ్మల్ని భారీగా విరాళాలు ఇవ్వమని నేను అనడం లేదు. వారితో కొంత సమయాన్ని కేటాయించండి. మీ ప్రేమను పంచండి. వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి పిల్లలతో కలిసి సమయాన్ని గడపండి. వారితో కలిసి భోజనం చేయడం ద్వారా వారి కడుపు మాత్రమే కాదు వారి హృదయం కూడా సంతోషంతో నిండిపోతుంది. ఎప్పుడైనా మీరు అనాథాశ్రమానికి వెళ్తే.. అక్కడ పిల్లలతో గడిపిన ఫోటోలను హియర్ ఫర్ యు అనే ట్యాగ్ పెట్టి షేర్ చేయండి’ అంటూ రాసుకొచ్చింది. శ్రీలీల మంచి మనసుకి నెటిజన్స్ ఇంత అందమైన మనసుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి శ్రీలీల పిల్లలతో సమయాన్ని గడపమని చెప్పడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.