కరోనాకు ముందు వరకు సోనూసూద్ కేవలం ఓ నటుడిగా మాత్రమే జనాలకు తెలుసు. కానీ, కరోనా సమయంలో తన మంచి పనులతో ఎంతో మందికి ఆయన దేవుడిగా మారారు. అడగక పోయినా వందలాది మంది కూలీలకు సహాయం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టినా ఆయన తన మంచి పనులను ఆపడం లేదు. ఇప్పటికీ ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నారు. స్వయంగా కలవక పోయినా.. సోషల్ మీడియా ఖాతాల ద్వారా విజ్ఞప్తి చేసుకుంటే చాలు సహాయం చేస్తున్నారు. ఇలా ఎంతో మంది లబ్ధిపొందారు పొందుతున్నారు కూడా. తాజాగా, సోనూసూద్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సహాయం కావాలని వచ్చిన ఓ దివ్యాంగుడికి జీవితంలో మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు.
ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఆ వ్యక్తికి కృత్తిమ చేతుల్ని అమర్చటానికి సహాయం చేశారు. అది కూడా కేవలం మూడు రోజుల్లోనే. ఇంతకీ సంగతేంటంటే.. అస్సాం రాష్ట్రానికి చెందిన రాజు అనే వ్యక్తి ప్రమాదంలో తన రెండు చేతుల్ని పోగొట్టుకున్నాడు. రెండు చేతుల్ని లేకుండా పోవటంతో ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. తన పని తాను చేసుకోవటానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కృత్తిమంగా రెండు చేతులు పెట్టించుకోవాలనుకున్నాడు. అయితే, రెండు చేతులు పెట్టించుకోవటానికి అతడి ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజుకు సోనూసూద్ గురించి ఎవరో చెప్పారు.
ఆయన దగ్గరకు వెళితే కచ్చితంగా సహాయం చేస్తాడని అన్నారు. రాజు ఎంతో నమ్మకంతో సోనూసూద్‌ను కలిశాడు. తన బాధను ఆయనకు చెప్పుకున్నాడు. రాజు ధీనగాథ విని సోనూసూద్ చలించి పోయారు. సహాయం చేస్తానని మాటిచ్చారు. మాటిచ్చిన మూడు రోజుల్లోనే రాజుకు సహాయం చేశారు. అతడికి కృత్తిమ చేతుల్ని పెట్టించారు. తనకు రెండు చేతులు రావటంతో రాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సోనూసూద్ దేవుడు అంటూ కొనియాడుతున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోనూసూద్ మంచి తనానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
Who say’s Ali has no hands ?❤️@SoodFoundation #inali https://t.co/AUMCz4SBYi pic.twitter.com/n4JNTVJ5Ua
— sonu sood (@SonuSood) November 2, 2022