ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గేయ రచయిత కందికొండ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన పాటలు రాసి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కందికొండ. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉండటం సంగీత ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. 15 సంవత్సరాల క్రితం క్యాన్సర్ బారిన పడిన కందికొండ కోలుకున్న కోలుకుని… ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం పైపు ద్వారా ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారు. కొన్నిరోజులుగా కాళ్లు చేతులు తిమ్మిర్లు ఎక్కుతుండటంతో డాక్టర్లు టెస్టులు చేసి కందికొండకు వెంటనే మరో ఆపరేషన్ చేయాలని.. లక్షల్లో ఖర్చవుతుందని తేల్చి చెప్పారు. దీంతో ఆ కుటుంబం మరోసారి చేయూత కోసం ఎదురుచూస్తోంది.
క్యాన్సర్ బారినపడ్డాక ట్రీట్‍మెంట్ కోసం రూ. 26 లక్షలు ఖర్చు అవగా.. ఉన్న కొద్దిపాటి ఆస్తులకుతోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చింది. తోటి గేయ రచయితలు, ఇతర దాతల సహకారంతో మొత్తంగా ఆయనకు ప్రాణాపాయం తప్పి ఇంటికొచ్చారు. అయితే చికిత్స టైంలో కీమోథెరపీ రేడియేషన్ వల్ల స్పైనల్ కార్డ్ లోని సీ1, సీ2 దెబ్బతిన్నాయి. అది కాస్త పెరాలసిస్‍కు కారణమైంది. అయితే కందికొండ ఆరోగ్యంగా ఉండాలంటే.. హైదరాబాద్ మాదాపూర్‍లోని మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్ సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలోని టీం సర్జరీ చేయనున్నారు. ఇందుకోసం దాదాపు రూ.15 లక్షలు కావాలి. ర్థికంగా యాదగిరి ఫ్యామిలీ పరిస్థితి బాగోలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు మళ్లీ సాయం కోరుతున్నారు. క్యాన్సర్‌పై పోరాడుతూ నెలలుగా ఆస్పత్రిలోనే ఉండటంతో ఖర్చు భరించలేక ఆయన సతీమణి రమాదేవి… ఇంటికి తీసుకొచ్చి వైద్యుల సలహాతో చికిత్స అందించారు.
ఇప్పటికీ పైపు ద్వారానే ఫ్లూయిడ్స్ తీసుకుంటూ కందికొండ జీవనపోరాటం సాగిస్తున్నారు. కందికొండ అభిమానులతో పాటు సినీ పెద్దలు, దాతలెవరైనా.. ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఆయన సతీమణి ప్రార్థిస్తున్నారు. గతంలో సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ పాటల రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్లు సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‍తేజ, చంద్రబోస్, బోలే షావలీ, రవివర్మ, భాస్కరభట్ల వంటివారు చేయూతనందించారు. సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వ పెద్దలతో పాటు దాతలు కందికొండను కాపాడుకునేందుకు మరోమారు స్పందించాలని వారంతా కోరుతున్నారు. దాతలు ముందుకు రావాలని.. కందికొండకు వెన్నముక శస్త్రచికిత్స విజయవంతం కావాలని, మళ్లీ పూర్వం రోజుల్లోలాగా ఆయన పాటలు రాయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కందికొండ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ :
కందికొండ రమాదేవి
యూనియన్ బ్యాంక్
(రాజీవ్ నగర్, హైదరాబాద్)
అకౌంట్ నంబర్: 135510100174728
ఐఎఫ్ఎస్సీ: UBIN0813559
గూగుల్ పే/ ఫోన్ పే: 8179310687
The renowned poet and a great lyricist who hails from Warangal and who’s honoured with doctorate by Osmania university for his exemplary work Dr. Kandikonda is battling with cancer.. Please support for his treatment @KTRTRS brother 🙏
Contact number
+91 99496 76007 pic.twitter.com/zXbGVrFVzU— KONA VENKAT (@konavenkat99) October 23, 2021