Sonam Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో రూ.2 కోట్ల చోరీకి సంబంధించిన దర్యాప్తును ఢిల్లీ పోలీసులు ముమ్మరం చేశారు. ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నర్సు అపర్ణ రీతూ వెల్సన్, ఆమె భర్త నరేశ్‌ను ఇదివరకే అరెస్ట్ చేశారు. వారిద్దరినీ విచారించారు. ఈ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. సోనమ్ ఇంట్లో దొంగతనం ఒక్కరోజులో జరిగింది కాదని పోలీసులు తెలిపారు. నిందితులు గత కొన్ని నెలలుగా ఇంటినుంచి బంగారం, విలువైన నగల్ని చోరీ చేస్తున్నట్లు వెల్లడించారు. పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం..
సోనమ్ భర్త ఆనంద్ అహుజా తల్లి ప్రియకు అపర్ణ కేర్ టేకర్‌గా సేవలు చేస్తోంది. ప్రియ గదిలో బంగారం, వజ్రాభరణాలు, డబ్బుని చూసిన నిందితురాలు ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. వాటిని దొంగిలిస్తే తమ అప్పులు తీరతాయని నరేశ్ ఆమెకు చెప్పాడు. దీంతో ఆమె ప్రతీరోజు రాత్రి ప్రియకు నిద్ర మాత్రలు ఇచ్చి విలువైన వాటిని దొంగతనం చేసేది. దొంగిలించిన వాటిని ఆమె భర్త బయట అమ్మేవాడు. ఇలా కొన్ని నెలలు చేశారు. అప్పులు మొత్తం తీరాయి. ఈ నేపథ్యంలోనే ఓ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : KGF-2 కలెక్షన్స్: 2వ రోజూ రాకీభాయ్ బాక్సాఫీస్ సునామి!