రాయి ఇండస్ట్రీ నుండి దూసుకు వచ్చి.. మన భాషను నేర్చుకుని స్టార్ డమ్ తెచ్చుకున్న అది కొద్ది మంది హీరోల్లో సిద్దార్ధ్ ఒకరు. ప్రముఖ దర్శకుడు మణి రత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అతడు.. బాయ్స్ సినిమాతో హీరోగా మారాడు. ఒక్క సినిమాతో చాలా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా యువకులు.. తమను సిద్దార్థ్ క్యారెక్టర్‌లో చూసుకోని వారుండరు.
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలున్నారు. వారి యాక్టింగ్ స్కిల్స్‍తో ముందుకు వెళుతుంటారు. కానీ పరాయి ఇండస్ట్రీ నుండి దూసుకు వచ్చి.. మన భాషను నేర్చుకుని స్టార్ డమ్ తెచ్చుకున్న అది కొద్ది మంది హీరోల్లో సిద్దార్ధ్ ఒకరు. ప్రముఖ దర్శకుడు మణి రత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అతడు.. బాయ్స్ సినిమాతో హీరోగా మారాడు. ఒక్క సినిమాతో చాలా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా యువకులు.. తమను సిద్దార్థ్ క్యారెక్టర్‌లో చూసుకోని వారుండరు. ఈ సినిమా యువతపై అంతటి ప్రభావాన్ని చూపించింది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ సాధించింది. దీంతో సిద్ధార్థ్‌కు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో అడుగుపెట్టేటప్పటికీ అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేశారు.
చుక్కల్లో చంద్రుడు పోయినా.. బొమ్మరిల్లులో ఆయన చేసిన ఫెర్మామెన్స్ పీక్స్ అనే చెప్పాలి. తండ్రి కోసం నలిగిపోయే తనయుడిగా జీవించేశాడు. ఆ సినిమాతో ఆయన ఇమేజ్ ఓ రేంజ్‌కు చేరింది. మధ్య మధ్యలో అడపా దడపా హిందీ, తమిళ సినిమాలు చేస్తూనే తెలుగులో ఫోకస్ పెంచాడు. ఆ తర్వాత ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్, జబర్థస్త్ వంటి సినిమాలు చేశారు. బొమ్మరిల్లు తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ హిట్ రాలేదు. ఆ తర్వాత బైలింగ్వల్, డబ్బింగ్ సినిమాల ద్వారానే పలకరించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత నేరుగా మహా సముద్రం అనే సినిమా చేశారు. ఇది కూడా డిజాస్టర్‌గా మారింది. ఇప్పుడు మరో సారి టక్కర్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ నెల 9న ఈ మూవీ విడుదల కాబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు సిద్ధార్థ్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్ ఒక మహిళ స్టేజీపైకి రావడంతో ఎమోషనల్ అయ్యారు. ఆమె కాళ్ల మీద పడి నమస్కరించడంతో పాటు.. ఆలింగం చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకు ఆమె ఎవరంటే.. తమిళ పరిశ్రమకు చెందిన సుజాత రంగరాజన్. ఆమె దర్శకుడు శంకర్‍కు చెబితేనే బాయ్స్ సినిమాకు హీరోగా సిద్దార్థ్‌ను తీసుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండాల్సిన తన జీవితం.. స్టార్ హీరో దిశగా మారింది. ఆమె రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని చెప్పారు. ఆమె లేక 20 ఏళ్ల సిద్ధార్థ్ కెరీర్ లేదన్నారు. ఇదొక పెద్ద సర్ ప్రైజ్ అన్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2లో నటిస్తున్నారు.