సెలబ్రిటీ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్లినా జాగ్రత్తగా మాట్లాడటం, స్టేజ్ పై కాంట్రవర్సీ కాకుండా ప్రవర్తించడం చాలా ముఖ్యం. కానీ.. కొన్నిసార్లు కావాలని చేయకపోయినా.. పొరపాట్లు, తప్పిదాలు జరిగిపోయి నెత్తిన పడుతుంటాయి. వాటిని భరించడం కంటే.. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడమే మంచిది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో శిల్పాని బీట్ చేసేవారు రాలేదనే చెప్పాలి. పెళ్ళై ఇన్నేళ్లయినా.. అందంలో శిల్పా ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ కి పోటీగా నిలుస్తోంది.
ఇక తాజాగా శిల్పాశెట్టి.. తనపై ఉన్న పబ్లిక్ ఈవెంట్ కిస్సింగ్ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 2007లో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్ లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేరి శిల్పాశెట్టిని ముద్దు పెట్టుకున్నాడు. అది కాస్తా వివాదాలకు దారితీయడంతో శిల్ప, రిచర్డ్ లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పుడా కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిందట శిల్ప. వివరాల్లోకి వెళ్తే.. 2007 ఏప్రిల్ 15న ఢిల్లీలోని సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమంలో శిల్పాశెట్టి.. నటుడు రిచర్డ్ గేరిని చేతులు పట్టుకొని స్టేజ్ పైకి తీసుకెళ్లింది. దీంతో అతను శిల్పను స్టేజ్ పైనే హగ్ చేసుకొని.. వరుసగా ముద్దులు పెట్టేశాడు.
అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో శిల్పాపై ఘోరమైన కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలో శిల్పపై కేసు నమోదైంది. అయితే.. 2011లో తనపై ఉన్న కేసును ముంబైకి బదిలీ చేయాలనీ సుప్రీం కోర్టును కోరింది. శిల్ప పిటిషన్ కి పర్మిషన్ ఇస్తూ.. కేసును ముంబైకి బదిలీ చేసింది సుప్రీం కోర్టు. అయితే.. శిల్పపై ఉన్న రెండు నేరాలలో ఒకదాంట్లో నిర్దోషిగా తేలింది. ఇక రెండో నేరంపై కేసు ఇంకా నడుస్తోంది. శిల్ప తరపున మధుకర్ దాల్వీ, లాయర్.. అవచాట్ సింగిల్ బెంచ్ ముందు వాదించారు. దాల్వీ వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు వేసిన ఫిర్యాదుదారుడు పూనంచంద్ భండారితో పాటు స్టేట్ గవర్నమెంట్ నాలుగు వారాలలో సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. చూడాలి మరి ఈసారి అయినా శిల్పాకి అనుకూలంగా తీర్పు రానుందేమో. మరి శిల్ప పబ్లిక్ కిస్సింగ్ కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.